/rtv/media/media_files/2025/04/10/XT72kcYmHkhNVtgF6xpu.jpg)
Mumbai Victims Tahawwur Rana case
Tahawwur Rana: ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
#WATCH | Mumbai, Maharashtra: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, a victim of the 26/11 attack, Devika Natwarlal Rotawan says, "I am overjoyed that Tahawwur Rana is finally being brought back to India. This is the biggest victory against… pic.twitter.com/qLldc0TLj0
— ANI (@ANI) April 9, 2025
2-3 నెలల్లో ఉరితీయండి..
ఈ మేరకు రాణా నేడు భారతదేశానికి చేరుకోనుండగా అతన్ని తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాధితులు, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 'రాణా లాంటి ఉగ్రవాదులకు భారతదేశం ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదు. కసబ్‌కు ఇచ్చినట్లుగా బిర్యానీ లేదా విశ్రాంతి ఇవ్వకూడదు. అటువంటి ఉగ్రవాదుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి. తద్వారా వారిని 2-3 నెలల్లో ఉరితీయవచ్చు' అని ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన మహ్మద్ తౌఫిక్ అలియాస్ 'ఛోటు చాయ్ వాలా' అన్నారు.
#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs
— ANI (@ANI) April 9, 2025
ఉగ్రవాదుల గురించి సమాచారం..
ఇక 'రాణాను చివరకు భారతదేశానికి తిరిగి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉగ్రవాదంపై భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం ఇది. అందువల్ల, నేను చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశం, అమెరికా ప్రభుత్వాలకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చింది. రాణాను తీసుకువచ్చిన వెంటనే అతని నుంచి పాకిస్తాన్‌లో ఇప్పటికీ దాక్కున్న ఉగ్రవాదుల గురించి సమాచారం సేకరించాలి. రాణాకు వీలైనంత త్వరగా మరణశిక్ష విధించాలి' అని దాడి బాధితురాలు దేవిక నట్వర్‌లాల్ రోతవాన్ అన్నారు.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
ఈ దాడిలో మరణించిన SRPF కానిస్టేబుల్ తండ్రి నిందితుడు రాణాకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 16 సంవత్సరాల క్రితం జరిగిన ఊచకోత తర్వాత తాను అనుభవించిన మానసిక కుంగుబాటు గురించి ఆయన మాట్లాడారు. '166 మంది ప్రాణాలను బలిగొన్న దాడుల్లో నిందితులందరికీ కఠిన శిక్ష విధించడం అనేది ఉగ్రవాద దాడిలో మరణించిన పోలీసు అధికారులు, పౌరులకు నిజమైన నివాళి అవుతుంది. ఈ ఘోరమైన దాడిలో చాలా మంది మరణించారు. 16 సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రతికూల ప్రభావం ఇప్పటికీ నా మనస్సులో ఉంది' అని ఎస్ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రాహుల్ షిండే తండ్రి సుభాష్ షిండే ఎమోషనల్ అయ్యారు.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ఎలా జరిగిందంటే..
2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని నగరంలోని అనేక ప్రాంతాలపై దాడి చేశారు. రైల్వే స్టేషన్, రెండు పెద్ద హోటళ్ళు, ఒక యూదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. ఇందులో 166 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ 10 మంది ఉగ్రవాదుల్లో ఒకరు కసబ్ మాత్రమే సజీవంగా పట్టుబడ్డారు. కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. నవంబర్ 2012లో పూణేలోని యెర్వాడ జైలులో ఉరితీయబడ్డాడు.
Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..
telugu-news | today telugu news