/rtv/media/media_files/2025/04/13/zyobyGY1UZ5NHHO9ar26.jpg)
Russia Attacks on Ukraine
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. సుమీ నగరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడ పండగ వేళ ఆదివారం స్థానికులంతా ఓ చోటు చేరగా.. రెండు క్షిపణి దాడులు జరిగినట్లు చెప్పారు. పండగవేళ ఈ మహావిషాదం జరిగిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?
విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు ఆపేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్న సందర్భంగా ఈ దాడులు జరిగాయి. సుమీ నగరంపై జరిగిన ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. రష్యా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుందని.. ఈ దాడుల్లో నివాసాలు, విద్యాసంస్థలు, కార్లు ధ్వంసమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
అలాగే ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలంటూ డిమాండ్ చేశారు. రష్యా ఉగ్రచర్చలను కోరుకుంటుందని.. యుద్ధాన్ని లాగుతోందని ఆరోపణలు చేశారు. రష్యాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా శాంతిని నెలకొల్పడం అసాధ్యమన్నారు. మాస్కో విషయంలో చర్చలు దాడులను నిలువరించలేకపోయాయని అసహనం వ్యక్తం చేశారు. ఓ ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో రష్యా పట్ల అలాంటి వైఖరే అవసరమని తెలిపారు.
Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?
Also Read: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం
telugu-news | rtv-news | russia-ukraine-war | international