/rtv/media/media_files/2026/02/24/iran-us-2026-02-24-10-46-00.jpg)
పశ్చిమాసియాలో పరిస్థితులు సెకను సెకనుకూ మారుతున్నాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధం(iran us war) ఏ క్షణమైనా మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ఆదేశాలు జారీ చేశారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. ఎప్పుడైనా అమెరికా వైమానిక దాడులకు దిగొచ్చనే భయంతో ఖమేనీ తన నివాసాన్ని మార్చినట్లు తెలుస్తోంది.
అమెరికా హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు. అంతిమ యుద్ధానికి సిద్ధం అంటూ ఇరాన్ ఆర్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యుద్ధం అంటూ వస్తే అది చివరి వరకు ఉంటుందని ఇరాన్ సవాల్ విసురుతోంది. ఇదే సమయంలో ఇరాన్ తన అంతర్గత భద్రతను పటిష్టం చేసుకుంది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా అలీ లారీజానీని నియమించారు. ఒకవేళ ఖమేనీకి ఏదైనా జరిగితే, ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకునేందుకు లారీజానీని సిద్ధం చేసినట్లు సమాచారం.
Also Read : నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత ఎంబసీ కీలక ఆదేశాలు
పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో భారత ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న భారతీయులందరూ వెంటనే ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని భారత ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇరాన్‌కు వెళ్లవద్దని భారత పౌరులకు సూచించింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కమర్షియల్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నప్పుడే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్లు అంచనా . ఏదైనా అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను (+989128109115) అందుబాటులో ఉంచింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు 10 నుంచి 15 రోజుల గడువు విధించినట్లు సమాచారం. ఈ లోపు అణు ఒప్పందానికి అంగీకరించకపోతే, ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలు, మిస్సైల్ లాంచ్ ప్యాడ్లు రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్థావరాలపై వైమానిక దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రెండు అమెరికా విమాన వాహక నౌకలు ఇరాన్ సమీపంలో మొహరించాయి.
Also Read : ట్రంప్ హత్యకు స్కెచ్.. తుపాకీతో ఇంట్లోకి దూరిన యువకుడు!
Follow Us