/rtv/media/media_files/2025/01/25/OBdOR6eKWssLWD0hrrg9.jpg)
USA
సాధారణంగా అమెరికాలో చదువు చాలా ఖరీదుగా ఉంటుంది. స్కాలర్ షిప్ లు వస్తే సరే...లేకపోతే పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకోవాల్సిందే. ఇక్కడ కాలేజీలు, యూనివర్శిటీల్లో కట్టాల్సిన ఫీజులు చాలా ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దాదాపు 80 శాతం మంది విద్యార్ధులు ఇదే పని చేస్తారు. ఉదయం అంతా కాలేజీలకు అటెండ్ అవుతారు. సాయంత్రాలు, రాత్రుళ్లు పని చేసుకుంటారు. అయితే ఇక మీద ఇది కుదరేలా కనిపించడం లేదు.
మిషిగన్ లో ఇద్దరు విద్యార్థులు..
అమెరికాలో మిషిగన్ స్టేట్ లో...ఓ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పని చేస్తుండగా పట్టుకున్నారు. వారు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట పనులు చేస్తున్నారు. విద్యార్థులకు ఇలా పని చేయడం అధికారికంగా వీలు లేదు. అధికారులు ఈ ఇద్దరు విద్యార్థులపైనా మూడు రోజుల పాటూ నిఘా పట్ట మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత వారికి ఇచ్చే గుర్తింపు సంఖ్య సెవిస్ ను రద్దు చేసారు. ఫిబ్రవరి 15లోగా అమెరికా విడిచి పెట్టి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ స్టూడెంట్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
Also Read: USA: తహవూర్ రాణాను అప్పగించేందుకు ఒప్పుకున్న అమెరికా సుప్రీంకోర్టు
ప్రస్తుతం ఈ పరిస్థితి ఒక్క మిషిగన్ లోనే కాదు మొత్తం అమెరికా అంతా ఉంది. అక్రమ వలసల చట్టాన్ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నందు వలన ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా అధికారులు పట్టుకుంటున్నారు. దీంతో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులందరిలో ఆందోళన మొదలైంది. ఒక్క స్టూడెంట్సే కాదు భారత వ్యాపారస్థుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. జాబ్ లు ఇచ్చినందుకు వారిపైనా చర్యలు తీసుకోవడమే దీనికి కారణం.ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 వీసాపై అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, మాస్టర్స్ పూర్తయి ఓపీటీ సమయంలో ఉన్నవారి పరిస్థితి ఎటూ తోచకుండా ఉంది.