/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t122533-2026-02-04-12-26-02.jpg)
Trump media clash : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి ప్రశ్నలు అడిగిన ఒక మహిళ జర్నలిస్టుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అనూహ్యంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సీఎన్ఎన్ ఛానల్‌కు చెందిన ఓ మహిళా రిపోర్టర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎన్ఎన్ ఛానెల్‌కు చెందిన కైట్లాన్ కొల్లిన్స్ అనే మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో కొత్తగా విడుదలైన పత్రాల గురించి కైట్లాన్ కొల్లిన్స్ ట్రంప్‌ను ప్రశ్నించడంతో 'నువ్వు ఒక చెత్త రిపోర్టర్'వి అంటూ విమర్శించారు.
.@POTUS NUKES @kaitlancollins:
— Rapid Response 47 (@RapidResponse47) February 3, 2026
"I've known you for ten years. I don't think I've ever seen a smile on your face. You know why you're not smiling? Because you know you're not telling the truth. You're a very dishonest organization — and they should be ashamed of you." 🔥 pic.twitter.com/GJFcH6vqvi
‘‘నేను పదేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పటివరకు ఒక్కసారి కూడా నవ్వినట్లు చూడలేదు. మీలాంటి వాళ్ల వల్లే సీఎన్ఎన్ ఛానల్ రేటింగ్ పడిపోతుంది. మీరు ఎప్పుడూ నిజాలు చెప్పరని మీకు బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో నాతో సహా ఇతరుల పేర్లను కుట్ర పూరితంగా విడుదల చేశారు. ఇప్పుడు ఇటువంటి విషయాల గురించి కాకుండా దేశం గురించి ఆలోచిస్తే అందరికీ మంచిది’’ అని ట్రంప్ (US President Trump) రిపోర్టర్ని ఉద్దేశించి అన్నారు. దీంతో మీడియా సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి అమెరికా న్యాయశాఖ ఇటీవల మరిన్ని పత్రాలను (Epstein files) విడుదల చేసింది. అందులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ, బిల్ గేట్స్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ల ప్రస్తావన, వారికి సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన ఫొటోలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనిపైనే తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో రిపోర్టర్ అమెరికా అధ్యక్షుడిని ప్రశ్నించారు. దీంతో ఆయన సీరియస్ అయ్యారు.
Follow Us