Ivanka Trump: ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్.. ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు జరిగిన ఓ భారీ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కు చెందిన IRGCతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్రకు పాల్పడ్డట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

New Update
Ivanka Trump reportedly targeted for assassination in IRGC revenge plot

Ivanka Trump reportedly targeted for assassination in IRGC revenge plot

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు జరిగిన ఓ భారీ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్రకు పాల్పడ్డట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతంలో అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసీం సులేమాని మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకే దీనిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ట్రంప్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని, ఇవాంకా ట్రంప్‌ను హతమార్చాలనిస ఆ ఉగ్రవాది ప్రణాళిక రచించినట్లు నివేదికలు వెల్లడించాయి.

Also read: వాహనాదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

 ఈ ప్లాన్‌ను అమలు చేసేందుకు యత్నిస్తున్న క్రమంలోనే భద్రతా సంస్థలు అలెర్ట్ అయ్యి.. పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేయడం వల్ల ఈ భారీ ముప్పు తప్పింది.అయితే ఈ అరెస్టుతో ఇరాన్ మద్దతుదారులు.. ట్రంప్ కుటుంబంపై ఎంత రగిలిపోతున్నారో మరోసారి తేలిపోయింది. సులేమాని మృతి తర్వాత కూడా ఇరాన్ సర్కార్‌తో పాటు IRGC అమెరికా ప్రతినిధులపై ప్రతీకార దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

ఇవాంకా ట్రంప్‌ భద్రతపై పర్యవేక్షణ, ఆమె కదలికలపై నిఘా పెట్టడం వల్లే కీలక ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కుట్ర భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఇవాంక ట్రంప్ హత్యకు యత్నించిన ఘటన అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతలను, భౌగోళిక రాజకీయ ఘర్షణలను మరింత తీవ్రతరం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు