ఏసు క్రీస్తు విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన ఇజ్రాయిల్

దక్షిణ లెబనాన్‌లో ఓ ఇజ్రాయెల్ సైనికుడు యేసు క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

New Update
Israeli soldier seen striking Jesus statue in Lebanon, Netanyahu Responds

Israeli soldier seen striking Jesus statue in Lebanon, Netanyahu Responds

దక్షిణ లెబనాన్‌లో ఓ ఇజ్రాయెల్ సైనికుడు యేసు క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. తమ మత సహనానికి, IDF విలువలకి ఇది విరుద్ధమన్నారు. గ్రౌండ్ ఆపరేషన్ జరిగిన సమయంలో ఈ దుశ్చర్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యుడైన సైనికుడిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: హర్మూజ్‌లో కలిసిన పాక్ పరువు.. అసీమ్ మునీర్ అట్టర్ ఫ్లాప్.. ఇరాన్ ఏమన్నదో తెలుసా?

 ఇజ్రాయెల్‌లో అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుందని నెతన్యాహు అన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి మతం భాగస్వామిగా ఉందని తెలిపారు. పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లలో కూడా క్రైస్తవులు దాడులకు గురవుతున్నట్లు మండిపడ్డారు. పశ్చిమాసియాలో చూసుకుంటే ఇజ్రాయెల్‌లో మాత్రమే క్రైస్తవ జనాభా సురక్షితంగా ఉంటూ వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తమ దేశంలోని మత స్వేచ్ఛను కాపాడేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. 

Also Read: రెండోసారి చర్చల్లో పాల్గొనేది లేదు.. ఇరాన్ సంచలన నిర్ణయం

ఈ దుశ్చర్య వల్ల లెబనాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటే వాళ్లను క్షమాపణలు చెబుతున్నట్లు నెతన్యాహు ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ శాఖ, విదేశాంగ మంత్రి ఈ విషయంలో విచారం వ్యక్తం చేశారు. తాజాగా ఆ దేశ ప్రధాని కూడా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకే ఇజ్రాయెల్ సర్కార్‌ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు