/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-08-31-47.jpg)
Israel Strikes Hezbollah Targets in Lebanon
Israel strikes : లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఆదివారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేశాయి. ఇజ్రాయెల్ భూభాగంపైకి పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు హెజ్‌బొల్లా సిద్ధమవుతోందన్న పక్కా నిఘా సమాచారంతో ఇజ్రాయెల్ ఈ 'ప్రివెంటివ్ స్ట్రైక్స్' (ముందస్తు దాడులు) నిర్వహించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన దాదాపు 50కి పైగా కీలక మౌలిక సదుపాయాల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది.
Over the past day (Saturday), the IDF struck numerous terrorist infrastructure sites and eliminated terrorists operating adjacent to IDF soldiers in southern Lebanon.
— 🔯 Monotheistic Zionist 🔯 (@Zionist_faithfu) May 2, 2026
In the strikes, approximately 70 military structures and approximately 50 Hezbollah infrastructure sites were… https://t.co/uyF27XSdI6
దక్షిణ లెబనాన్, బెకా లోయ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తీవ్రంగా గాలించి దాడులు చేశాయి. ప్రధానంగా ఆయుధ గిడ్డంగులు, హెజ్‌బొల్లా నిల్వ ఉంచిన భారీ ఆయుధ సామాగ్రిని నాశనం చేశారు. అలాగే కమాండ్ సెంటర్లు , ఆ సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేసే వ్యూహాత్మక కేంద్రాలు,క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపైకి రాకెట్లు ప్రయోగించే లాంచర్లను నేలమట్టం చేశారు.ఈ భీకర దాడుల ఫలితంగా హెజ్‌బొల్లాకు చెందిన వ్యూహాత్మక ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయని, పలువురు ఉగ్రవాదులు కూడా హతమై ఉంటారని ఇజ్రాయెల్ రక్షణ దళాలు అంచనా వేస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హెజ్‌బొల్లా నిరంతరం ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాలపైకి రాకెట్లతో దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది."మా దేశ పౌరుల రక్షణే మాకు ప్రథమ ప్రాధాన్యం. హెజ్‌బొల్లా ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు, సరిహద్దు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది." అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.ప్రస్తుతానికి సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితిని బట్టి ఇజ్రాయెల్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.
Follow Us