/rtv/media/media_files/2026/04/24/israel-pm-benjamin-netanyahu-2026-04-24-18-56-50.jpg)
Israel PM Benjamin Netanyahu Declares He Underwent Cancer Treatment
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఓవైపు హెజ్‌బొల్లాపై ఇరాన్ దాడులు చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. తనకు ప్రోస్టెట్ క్యాన్సర్ ప్రారంభ దశలోనే నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి విజయవంతంగా చికిత్స పూర్తయినట్లు వెల్లడించారు. యుద్ధం నెలకొన్న నేపథ్యంలో తన వార్షిక వైద్య రిపోర్టును రెండు నెలలు ఆలస్యంగా విడుదల చేయించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ తప్పుడు ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: నికోలస్ మదురో నిర్బంధంపై పందెం.. రూ.3 కోట్లు గెలుచున్న సైనికుడు
ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో, శారీరక దృఢత్వంతో ఉన్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఏడాది క్రితం నెతన్యాహు ప్రోస్టేట్ గ్రంథి వాపునకు సంబంధించి సర్జీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అయితే ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ప్రోస్టేట్‌లో ఒక సెంటీమీటర్ కన్నా తక్కువ పరిణామంలో ఓ చిన్న మచ్చ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అది క్యాన్సర్ కణితిగా ప్రారంభ దశలోనే ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఆ సమయానికి అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించలేదు.
Also Read: అమెరికా వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. H1 బీ వీసా మూడేళ్లు రద్దు !
దీంతో తనకున్న సమస్యపై నిరంతర వైద్యుల పర్యవేక్షణ కన్నా ఆ కణితిని పూర్తిగా తొలగించే చికిత్స చేయాలని నెతన్యాహు వైద్యులను కోరారు. జెరూసలేంలోని హదస్సా ఆస్పత్రిలో ఆయనకు ఈ చికిత్స జరిగింది. ఈ చికిత్స తర్వాత ఆ మచ్చ పూర్తిగా మాయమైపోయినట్లు నెతన్యాహు తెలిపారు. అంతేకాదు చికిత్స సమయంలో కూడా తాను పనిచేస్తూనే ఉన్నాని పేర్కొన్నారు. వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు యుద్ధంలో గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
Follow Us