ఖమేనీని చంపాలని నవంబర్‌లోనే ప్లాన్ చేసిన ఇజ్రాయెల్.. వెలుగులోకి సంచలన నిజాలు

అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఖమేనీ హతమార్చారని గతేడాది నవంబర్‌లోనే నిర్ణయించామని ఇజ్రాయెల్ తెలిపింది.

New Update
Israel decided to kill Khamenei in November

Israel decided to kill Khamenei in November

అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఖమేనీ హతమార్చారని గతేడాది నవంబర్‌లోనే నిర్ణయించామని ఇజ్రాయెల్ తెలిపింది. ఆ దేశ రక్షణ మంత్రి కట్జ్‌.. మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. '' గతేడాది చివర్లో హైలెవల్‌ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఖమేనీ అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నాం. 

Also Read: IRGC కొత్త కమాండర్‌గా ట్రంప్ బద్ధశత్రువు.. అహ్మద్ వాహిది ఎవరో తెలుసా ?

ఇప్పుడు ఇరాన్‌పై జరుగుతున్న ఆపరేషన్ 2026 మధ్యలో జరగాల్సి ఉంది. ఈ ప్లాన్ గురించి అమెరికాకు కూడా చెప్పలేదు. ఇటీవల ఇరాన్‌ పాలనను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసనలు చేశారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహు మధ్య ఈ అంశంపై చర్చ జరిగింది. దీంతో ఇరుదేశాలు కలిసి ముందుగానే ఈ ఆపరేషన్ ప్రారంభించాయని''  కట్జ్‌ తెలిపారు. 

Also Read: ఇరాన్‌కు బిగ్ షాక్.. B-52 బాంబర్లతో రెచ్చిపోతున్న అమెరికా..

ఫిబ్రవరి 28న ఖమేనీ నివాస సముదాయమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, మనువడు కూడా చనిపోయారు. దాదాపు 40 మంది కీలక నేతలు ఈ దాడుల్లో మృతి చెందారు. రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలు, ఫోన్‌ నెట్‌వర్క్‌ను ఇజ్రాయెల్ ట్రాక్‌ చేసి ఖమేనీ కదలికలపై నిఘా పెట్టింది. ఆ తర్వాత అమెరికాతో కలిసి అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది. ఖమేనీ మృతికి ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై, అలాగే ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. 

Advertisment
తాజా కథనాలు