/rtv/media/media_files/2025/06/26/iran-supreme-leader-ali-khamnei-2025-06-26-19-17-54.jpg)
Iran supreme leader Ali Khamnei
Ayatollah Ali Khamenei: పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్-అమెరిగా సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు . ఆయన మరణంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 28వ తేదీ శనివారం తెల్లవారుజామున తన కార్యాలయంపై జరిగిన దాడిలో ఖమేని దుర్మరణం వార్త ప్రపంచానికి తెలిసింది. దీంతో టెహ్రాన్ వీధులన్నీ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ పరిణామంతో ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అయితే ఆరోజు దాడిలో ఖమేనితోపాటు భార్య, కూతురు, అల్లుడు, మనవడు చనిపోవడం బాధాకరమైనప్పటికీ, మిగతా కుటుంబసభ్యులు ఎక్కడ అనేది ఇప్పుడు అంతుచిక్కని రహస్యంగా మారింది.
Also Read: ఒక్క తూటా పేలకుండా అమెరికా ఆట కట్.. ఇరాన్ కు చైనా ప్రొఫెసర్ సలహా ఇదే!
1939లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించిన ఖమేని...మత బోధకుడిగా మారారు. ఖొమైనీ శిష్యుడిగా ఇస్లామిక్ విప్లవంలో తనదైన ముద్రవేశారు. ఓ బిజినెస్ మ్యాన్ కుటుంబంలో పుట్టిన 17ఏళ్ల వయసున్న మన్సూరేను పెళ్లాడాడు ఖమేని. ఖమేని దంపతులకు ఆరుగురు సంతానం. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఇక్కడో విషయం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ సుప్రీం నాయకుడిగా ఖమేని 36ఏళ్ల సుదీర్ఘ పాలనలో ఏరోజూ కూడా బహిరంగంగా భార్య మన్సూరే కనిపించలేదు. ఫ్యామిలీ విషయంలో అంత గోప్యతగా ఉండేవాడు ఖమేని. వాస్తవానికి వ్యాపారంలోనూ, ఆ దేశ మీడియా రంగంలోనూ ఖమేని భార్య మన్సూరే అత్యంత ప్రభావం కలిగిన వ్యక్తి అయినప్పటికీ...ఆమె ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు.
Also Read: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేము.. కోర్టు సంచలన కామెంట్స్!
ఇక ఖమేని కూతుళ్లు బోష్రా, హోడాలకు కొన్నేళ్ల క్రితమే పెళ్లిళ్లు జరిగాయి. తండ్రి ఖమేనితోపాటు ఓ కూతురు సైతం ఫిబ్రవరి 28నాటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక కుమారులు విషయానికి వస్తే...ముస్తఫా, మొజ్‌తబా, మసూద్, మీసమ్. ఈ నలుగురిలో మొజ్‌తబా అత్యంత ప్రభావవంతుడైన వ్యక్తిగా మెజార్టీ ఇరానీయన్లు బలంగా నమ్ముతున్నారు. ఖమేని దంపతుల రెండో కొడుకే మొజతబా. ఐఆర్‌జీసీలో పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి వారసత్వాన్ని... షియాల హక్కులను, సిద్ధాంతాలను కాపాడగలగడంలో మొజ్‌తబా మంచినాయకుడంటూ తండ్రి బతికున్నకాలంలోనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఖమేని మరణంతో తదుపరి సుప్రీం నాయకుడిగా మొజ్‌తబా పేరు వినిపిస్తోంది. పైగా, మొజతబానే సరైన నాయకుడంటూ ఇటు ఐఆర్‌జీసీ కూడా మద్దతు పలకడంతో దాదాపు సుప్రీం లీడర్ ఆయనే అన్న వార్త ప్రపంచమంతా చుట్టేసింది. మొజతబా ఖమేని విషయానికి వస్తే...కోమ్‌లోని ఓ మతపాఠశాలలో ఇస్లామిక్ వేదం బోధిస్తున్నాడు.
Also Read: ఇకపై అలాంటి పాటలు పాడను.. శ్రేయా ఘోషల్ షాకింగ్ కామెంట్స్!
1987-1988 మధ్యకాలంలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొని సైనిక సేవ అందించారు. అలాగే తండ్రి ఖమేని ఆధ్వర్యంలో పటిష్టపరిచిన ఐఆర్‌జీసీ దళంతో బలమైన సత్సంబంధం కలిగిఉన్నారు. తండ్రి ఖమేని కార్యాలయంలో ఏ పనైనా మొజతబా కనుసన్నల్లోనే సాగేదని ఇరానీయులు చెబుతుంటారు. ప్రస్తుతం మొజ్‌తబా వయస్సు 56ఏళ్లు.. 27ఏళ్లుగా తెరవెనుక ఉండి ఇరాన్ రాజకీయాలను శాసిస్తున్న మొజతబా ఇప్పుడు నేరుగా అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే ఇరాన్‌ను కాపాడుకుంటూ వస్తున్న ఐఆర్‌జీసీ బలగాలను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఇప్పుడు అదే సైన్యం మద్దతుతో ముజ్‌తబా అధికారపీఠం ఎక్కితే పశ్చిమాసియా సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇరాన్‌లో మానవ హక్కులను హరించిన ఖమేనిపై ఇప్పటికీ ఆదేశంలో అగ్గిరాజుతోంది. ఖమేని మరణవార్తతో ఇరానీ మహిళలు రోడ్డెక్కి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అయితే వీళ్లంతా ఖమేని వారసత్వ రాజకీయాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
అయితే ఖమేని ప్లేస్‌లో ఎవరొచ్చినా సరే లేపేయడం గ్యారంటీ అని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలీరెజా అరీఫాను ఎన్నుకోవడం...గల్ఫ్‌దేశాల ఆర్థికమూలాలపై తమ మిస్సైళ్లతో ఇరాన్ విరుచుకుపడటం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి.
Also Read: హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి
ఇక ఖమేని మిగతా కొడుకుల విషయానికి వద్దాం... పెద్దకొడుకు పేరు ముస్తఫా...కేవలం మతపరమైన అంశాల పరిధిలో పనిచేస్తూ ఉంటాడు. తండ్రి వారసత్వానికి ఇతను ఆరడుగుల దూరం. రాజకీయాలకు దూరంగా ఉంటూ వివాదరహితుడిగా ముస్తఫా ఖమేనికి పేరుంది. అలాగే, ఖమేని మూడోకొడుకు పేరు మసౌద్ ఖమేని. తండ్రి ఖమేని రచనలకు సంబంధించి దగ్గరుండి చూసుకునేవాడు. ప్రచురణలు, ఇరాన్‌లోని సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రతినిధిగా ఉంటూ ఆ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటూ వస్తుండేవాడు. మీసమ్...ఖమేని దంపతుల చిన్నకొడుకు. మీసమ్ కూడా అన్న మసౌద్‌కు తోడుగా ఉండేవాడు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాదు...ఇస్లామిక్ విద్యాసంస్థలను దగ్గరుండి పర్యవేక్షించేవాడు.
అయితే ఇజ్రాయెల్-అమెరికా ముప్పేటదాడి చేస్తున్న ఈవేళ...ఖమేని కొడుకు,కూతుళ్లపై ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. మిగతావారు ఎక్కడా అనేది రాడార్లకు సైతం అంతుచిక్కడం లేదట. అయితే ఖమేని మరణాంతరం ఇరాన్ అవలంభిస్తున్న వైఖరి అమెరికాకు ఏమాత్రం నచ్చడం లేదు. సుప్రీం లీడర్‌ను కోల్పోయాక మెతకవైఖరితో ఉండాల్సిన ఇరాన్...ఇప్పుడు ఒంటరిగా పోరుసాగించడంతో ఖమేని మూలాలను సైతం పెకిళించాలని అమెరికా-ఇజ్రాయెల్ ప్రతినబూనినట్లు తెలుస్తోంది.
Follow Us