BREAKING: మేము చెప్పేది వినాల్సిందే.. గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ సంచలన హెచ్చరిక

తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు. గల్ఫ్‌లో దాడులు ఆగాలంటే తాము చెప్పినట్లు వినాలన్నారు. ఆయా దేశాల గగనతలాలను వాడుకొని శత్రువులు తమపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Iran's Sensational message to Gulf Countries amid war

Iran's Sensational message to Gulf Countries amid war

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు. గల్ఫ్‌లో దాడులు ఆగాలంటే తాము చెప్పినట్లు వినాలన్నారు. ఆయా దేశాల గగనతలాలను వాడుకొని శత్రువులు తమపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా,బహ్రెయిన్‌, UAE, జోర్డాన్, ఇతర పశ్చిమ దేశాలు వాటి గగనతలాలు వినియోగించుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌కు పర్మిషన్ ఇవ్వొద్దని సూచించారు. 

Also Read: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడులు.. వీడియో వైరల్

ఏ దేశంపై కూడా తాము ముందస్తు దాడులు చేయమని ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్లు పెజెష్కియాన్ తెలిపారు. కానీ తమ మౌలిక సదుపాయాలు, అణు, ఆర్థిక కేంద్రాలను మాత్రం టార్గెట్ చేస్తే సహించేది లేదన్నారు. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. శత్రు స్థావరాలను ధ్వంసం చేసేవరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ శత్రువులకు సహకరించిన వాళ్లను కూడా వదలేది లేదని తేల్చిచెప్పారు.  

Also Read: 28 రోజుల యుద్ధం.. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీగా నష్టం.. లెక్కలు ఇవే

ఇదిలాఉండగా ఇరాన్.. భారత్‌తో పాటు తమ మిత్ర దేశాల నౌకల కోసం హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. దీంతో భారత్‌కు చెందిన రెండు LPG నౌకలు శనివారం హర్మూజ్‌ను సురక్షితంగా దాటాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నౌకలు 90 వేల టన్నులకు పైగా LPGని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాయి. భారత్‌కు చెందిన మరో ఐదు ట్యాంకర్లు.. UAE సమీపంలో ఉన్న జలాల్లో ఇరాన్ పర్మిషన్ కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం.  

Advertisment
తాజా కథనాలు