Iran: ఖర్గ్‌ ఐలాండ్‌పై దాడులు.. అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్‌

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది. అమెరికా చర్యలను ఖండిస్తూ ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది.

New Update
iran warns on US attacking kharg island attack

iran warns on US attacking kharg island attack


ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే తాజాగా ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది. అమెరికా చర్యలను ఖండిస్తూ ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. మా చమురు మౌలిక సదుపాయాలపై జరిగే ఏ దాడినైనా తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. ఇలా జరిగితే అమెరికాతో సంబంధం ఉన్న చమురు కంపెనీల మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోతాయని వార్నింగ్ ఇచ్చింది. 

Also Read: హర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ మార్గాలు.. కానీ ఇక్కడే సమస్యలు

వాటిని బుడిద కుప్పలుగా మార్చేస్తామని హెచ్చరించింది. అయితే ఇరాన్‌ చమురు ఎగుమతికి కీలకంగా ఉన్న ఖర్గ్‌ ఐలాండ్‌పై తన ఆదేశాల మేరకే దాడులు జరిగిట్లు ట్రంప్ ప్రకటించారు. కానీ అక్కడున్న చమురు సదుపాయాల జోలికి వెళ్లలేదని చెప్పారు. కానీ హర్ముజ్ జలసంధి మార్గం గుండా వచ్చే నౌకలను అడ్డుకుంటే ఇరాన్‌ చమురు మౌలిక సదుపాయాలను కూడా టార్గెట్ చేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ దాడులపై ఇరాన్ స్పందించింది. 

Also Read: మొజ్తాబా ఎక్కడున్నాడో చెపితే రూ.92 కోట్లు ఇస్తాం.. అమెరికా సంచలన ఆఫర్

ఖర్గ్‌ ఐలాండ్ అనేది పర్షియన్ గల్ఫ్‌లో ఓ చిన్న ద్వీపం. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ ఐలాండ్ ఎంతో కీలకంగా పనిచేస్తోంది. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరిగాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఇప్పటిదాకా దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు