/rtv/media/media_files/2026/04/04/trump-2026-04-04-18-46-43.jpg)
Iran war US military aircraft hit first shot down by enemy fire in over 20 years
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దాడులు(Iran Israel America War) ఐదు వారాలకు చేరుకున్నాయి. ఇప్పటికే ఇరాన్ తీవ్రంగా నష్టపోయినప్పటికీ చావోరేవో తేల్చుకుంటామన్న రీతిలో అమెరికాతో యుద్ధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. గడచిన 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌తో పాటు మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ కూల్చివేసింది. గత రెండు దశాబ్ధాల కాలంలో అమెరికాకు జరగని అత్యంత దారుణమైన నష్టం, దాడిగా దీన్ని పేర్కొంటున్నారు పరిశీలకులు. ఇరాన్ చేస్తున్న ఎదురుదాడి ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో తనే యుద్ధం ముగించే పరిస్థితి నెలకొన్నదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
How Iran shot down a US F-15 fighter jet? NDTV's @VishnuNDTV has all the details pic.twitter.com/tuafMGe0AT
— NDTV (@ndtv) April 4, 2026
Also Read : ఇరాన్‌కు బిగ్ షాక్.. అణు విద్యుత్ కేంద్రంపై దాడులు
Iran War US Military Aircraft Hit First Shot Down By Enemy Fire
కాగా, గత కొంతకాలంగా ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(iran attack on trump) ప్రకటించడమే కాకుండా, టెహ్రాన్ కు క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించే సామర్థ్యం గణనీయంగా తగ్గి పోయిందని ట్రంప్ ప్రకటించిన కొద్ది సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. 2003 తర్వాత తొలిసారి శత్రువుల కాల్పులకు అమెరికా జెట్‌లు కూలిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరాన్ యుద్ధంలో ప్రత్యర్థుల చేతిలో అమెరికా యుద్ధ విమానాలను కూలిపోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. గడచిన 20 ఏళ్లలో అమెరికా యుద్ధ విమానం శత్రువుల దాడిలో కూలిపోవడం ఇదే మొదటిసారి కావడం చర్చనీయంశంగా మారింది.
శుక్రవారం అమెరికాకు చెందిన ఒక F15-E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. కాగా ఈ ఘటనలో పాల్గొన్న ఒక సైనికుడిని రక్షించగా, రెండో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. అలాగే, ఇరాన్ రక్షణ దళాల దాడిలో అమెరికాకు చెందిన A-10 అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా కూలిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించడం విశేషం. చివరిసారిగా 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన A-10 థండర్‌బోల్ట్ II విమానం శత్రువుల దాడిలో కూలిపోయింది. ఆ తర్వాత 20 ఏళ్ల కు మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం, అదీ ట్రంప్ హయాంలో జరగడం గమనార్హం. అయితే సాధారణంగా తమ సైన్యానికి ఎటువంటి ప్రాణనష్టం జరగదని భావించే అమెరికాకు ఇది పెద్ద మైసస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు యుద్ధ విమానాలు కూలిపోవడం, సైనికుల ఆచూకీ తెలియకపోవడం వంటి ఘటనలు అమెరికాకు బిగ్ షాక్ అని చెప్పచ్చు. రాజకీయంగా కూడా ఇది ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు.
Also Read : తీవ్ర ప్రాణ నష్టం మిగిల్చిన పశ్చిమాసియా యుద్ధం..ఎన్నివేలమందో తెలుసా?
ప్రస్తుత యుద్ధంలో అమెరికా కొంత వెనక్కు తగ్గినా ఇరాన్ మాత్రం తన ఉనికిని కాపాడుకోవడానికి చావో రేవో అన్న రీతిలో ఎదురు దాడులకు దిగుతోంది. ఫిబ్రవరి 28 మొదలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు గత ఐదు వారాలుగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను దెబ్బతీశామని ట్రంప్ ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉందనడానికి ఈ దాడులే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.కాగా, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీపై ఎగిరిన అమెరికా యుద్ధ విమానాల నష్టాల రేటు 3 శాతంగా ఉండేదని, ఇది ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న యుద్ధంలో సుమారు 350 యుద్ధ విమానాలకు సమానమని ఆయన అన్నారు.
అమెరికా విమానాలను కూల్చడానికి ఇరాన్ రాడార్లకు కూడ చిక్కని భుజంపై నుండి ప్రయోగించే క్షిపణులను వాడి ఉండవచ్చని పలువురు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉండటంకూడా ఇరాన్‌కు వరంగా మారిందని ఇరాన్ ప్రోగ్రామ్ సీనియర్ డైరెక్టర్ బెహ్నామ్ బెన్ తలేబ్లు అన్నారు.
Follow Us