BIG BREAKING: శాంతి చర్చలు ప్రారంభం.. ఇరాన్ కండిషన్లకు అంగీకరించని అమెరికా !

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అంతకుముందు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు.

New Update
BREAKING

BREAKING

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అంతకుముందు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల్లో ఇరాన్ ప్రతిపాదించిన కండిషన్లకు అమెరికా ఆమోదం చెబుతుందా ? లేదా ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందు ఇరాన్ ప్రతిపాదించిన రెండు షరతులకు అమెరికా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. 

Also read: శాంతి చర్చలకు ముందు పాకిస్థాన్‌లో హైటెన్షన్.. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు

అంతర్జాతీయ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను వెంటనే విడుదల చేయడం, లెబనాన్‌ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ప్రకటించడం.. ఈ రెండు షరతులకు అమెరికా ఒప్పుకున్నట్లు ప్రచారం నడిచింది. కానీ దీనిపై ఓ అమెరికా అధికారి స్పందించారు. ఇరాన్ షరతులకు అమెరికా ఒప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. ఇప్పటిదాకా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో శాంతి చర్చల్లోనే అమెరికా.. ఇరాన్‌ ప్రతిపాదించిన డిమాండ్లకు అంగీకరిస్తుందా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: ఇరాన్‌కు సైనికుడిగా.. అమెరికాకు నాయకుడిగా.. మునీర్ 'డ్రెస్ కోడ్' వెనుక రహస్యం అదేనా..

ఇదిలాఉండగా ఇరాన్ విధించిన ముందస్తు షరతుల వల్ల 5 గంటలు ఆలస్యంగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ చర్చల ఫలితంపై తనకు క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఇరాన్ నిజాయితీని త్వరలోనే అంచనా వేస్తామని తెలిపారు. హర్మూజ్ జలసంధి త్వరలో మళ్లీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఒకవేళ చర్చలు ఫెయిల్ అయితే అమెరికా మళ్లీ దాడులు చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు