యుద్ధం ఆపడానికి: అమెరికా ముందు ఇరాన్ 10 కండీషన్లు.. ట్రంప్‌కు షాక్

అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ డీల్‌లో 45 రోజుల కాల్పుల విరమణకు బదులుగా, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి 10 కండీషన్లు ఇరాన్ అమెరికా ముందు ఉంచింది.

New Update
_War expenses

పశ్చిమాసియ యుద్ధంలో ఇరాన్, అమెరికా దేశాలు తగ్గేదెలే అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డెడ్‌లైన్ విధిస్తే.. ఇరాన్‌ కూడా అగ్రరాజ్యానికి కండీషన్లు పెట్టింది. దాడులు ఆపాలన్నా, కాల్పుల విరమణ చేయాలన్నా తమ 10 కండీషన్లకు ట్రంప్ ఒప్పుకోవాల్సిందే అని ఇరాన్ పట్టుబట్టింది. అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. పాకిస్తాన్ రెండు దేశాల మధ్య రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ డీల్‌లో 45 రోజులపాటు కాల్పుల విరమణకు బదులుగా, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి 10 నిబంధనలతో కూడిన ఒక ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచింది. బుధవారం లోగా హర్మోజ్ జలసంధి తెరవకుంటే మంగళవారం రాత్రే ఇరాన్‌ను నాశనం చేస్తానని ట్రంప్ శపథం చేశాడు. ఈక్రమంలో ఇరాన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు.

ఇరాన్ పెట్టిన 10 నిబంధనలు:

భవిష్యత్తులో దాడులు చేయకూడదు: అమెరికా, దాని మిత్రదేశాలు భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై ఎలాంటి దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలి.
యుద్ధానికి శాశ్వత ముగింపు: కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ సరిపోదని, యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
అన్ని ఆంక్షల ఎత్తివేత: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న అమెరికా అన్ని ఆర్థిక, రాజకీయ ఆంక్షలను తక్షణమే తొలగించాలి.
మిత్రపక్షాలపై దాడులు ఆపాలి: ఇరాన్ మిత్రపక్షాలైన హెజ్బుల్లా (లెబనాన్), ఇతర ప్రాంతీయ గ్రూపులపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను నిలిపివేయాలి.
హోర్ముజ్ పునఃప్రారంభం: శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితే, అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ అనుమతిస్తుంది.
నౌకలపై రుసుము : హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌక నుండి సుమారు $2 మిలియన్ల రుసుమును ఇరాన్ వసూలు చేస్తుంది.
ఒమన్‌తో ఆదాయం పంపిణీ: వసూలు చేసిన ఆ ఆదాయాన్ని జలసంధికి అవతలి వైపు ఉన్న ఒమన్‌ దేశంతో ఇరాన్ పంచుకుంటుంది.
సురక్షిత ప్రయాణానికి యంత్రాంగం: నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు ఇరాన్, ఒమన్ జాయింట్‌గా ఓ పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయి.
పునర్నిర్మాణ నిధి: యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాలను (వంతెనలు, పవర్ ప్లాంట్లు) పునర్నిర్మించడానికి వసూలు చేసిన నౌకల రుసుమును ఉపయోగిస్తారు.
ప్రత్యక్ష పరిహారం బదులు రుసుము: అమెరికా నుండి నేరుగా యుద్ధ నష్టపరిహారం కోరడానికి బదులుగా, ఈ నౌకల రుసుము ద్వారానే తమ దేశాన్ని బాగు చేసుకుంటామని ఇరాన్ ప్రతిపాదించింది.

ప్రస్తుత పరిస్థితి:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనను "ఒక ముఖ్యమైన అడుగు" అని అభివర్ణించినప్పటికీ, ఇది "పూర్తిగా సరిపోదు" అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్(ఈ రోజు నైట్) 7 రాత్రి 8 గంటల లోపు తుది నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైన దాడులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై ఈజిప్ట్, పాకిస్తాన్, టర్కీ దేశాలు మధ్యవర్తులుగా చర్చలు జరుపుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు