Iran: అమెరికన్ పైలట్‌ను పట్టుకుంటే భారీ నజరానా.. ఇరాన్ సంచలన ఆఫర్

ఇరాన్‌లో ఓ అమెరికన్ పైలట్‌ తప్పించుకున్న సంగతి తెలిసిందే. స్థానిక గవర్నర్ సంచలన ప్రకటన చేశారు. అమెరికన్ పైలట్‌ను పట్టుకున్నా లేదా అతడిని చంపిన వాళ్లకు భారీగా నజరానా అందిస్తామని ఆఫర్ ఇచ్చారు.

New Update
Iran promises reward to 'capture or kill' American pilot after F-15 shot down

Iran promises reward to 'capture or kill' American pilot after F-15 shot down

ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లలో ఒకరు సురక్షితంగా రక్షించబడగా, రెండో పైలట్ ఆచూకీ దొరకలేదు. అయితే తప్పించుకున్న ఆ పైలట్ కోసం ఇరాన్ దళాలతో సహా స్థానిక ప్రజలు కూడా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక గవర్నర్ సంచలన ప్రకటన చేశారు. అమెరికన్ పైలట్‌ను పట్టుకున్నా లేదా అతడిని చంపిన వాళ్లకు భారీగా నజరానా అందిస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇరాన్ ఆర్మీ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఒకవేళ తాము పైలట్‌ను పట్టుకుంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం 'యుద్ధ ఖైదీ'గా పరిగణిస్తామని.. తగినంత గౌరవం అందిస్తామని తెలిపింది. 

Also Read: రెండు దశాబ్ధాల్లో అమెరికాకు భారీ షాక్‌..ఇరాన్‌ దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి

మరోవైపు  పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. "మీ పిల్లలు ఇరాన్ పాలనలో ఉండటం కన్నా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనలో ఉండటమే వాళ్లకి ఎక్కువ ప్రమాదం. ఆ పైలట్‌ అమెరికా సహాయక బృందాలకు దొరకడం కన్నా మాకు దొరకాలని కోరుకోండి. ముస్లింలుగా.. నాగరికత తెలిసిన ఇరాన్ దేశస్థులుగా యుద్ధ ఖైదీలను ఎలా గౌరవించాలో మాకు తెలుసని" ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. 

మరోవైపు సౌతాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు వీటి మిత్ర దేశాలను విమర్శించింది. యుద్ధ ఖైదీలను తాము జియోనిస్టులు (ఇజ్రాయెల్ మిత్రపక్షాలు) చూసినట్లు క్రూరంగా చూడమని తెలిపింది. అమెరికా పాటించే పాతకాలం నాటి పద్ధతులు కాకుండా నాగరిక విధానాలతో బంధీలను చూసుకుంటామని పేర్కొంది. ఇదిలాఉండగా శుక్రవారం జరిగిన దాడుల్లో రెండు అమెరికా యుద్ధ విమానాలు కూలిపోగా.. అందులో ఒకదాని నుంచి గాలిలో దూకి తప్పించుకున్న పైలట్ ఆచూకి తెలియలేదు. ఆ పైలట్ కోసమే అమెరికా, ఇరాన్ గాలిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ పైలట్‌ను పట్టుకున్నా లేదా చంపినా భారీ నజరానా ఇస్తామని స్థానిక గవర్నర్ ఆఫర్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: ఇరాన్‌కు బిగ్ షాక్.. అణు విద్యుత్ కేంద్రంపై దాడులు


 

Advertisment
తాజా కథనాలు