BIG BREAKING: సంచలన అప్‌డేట్.. హర్మూజ్‌ జలసంధిని తెరిచిన ఇరాన్

గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది.

New Update
Iran Opens Strait Of Hormuz For All Commercial Vessels After Lebanon Ceasefire

Iran Opens Strait Of Hormuz For All Commercial Vessels After Lebanon Ceasefire

గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ సీజ్‌ఫైర్ కొనసాగేవరకు హర్మూజ్‌ను పూర్తిగా తెరిచే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ రూట్‌గుండా వెళ్లే నౌకలకు అడ్డు తగలమని తెలిపింది. 

ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ఇజ్రాయెల్ తమ వైమానిక దాడులు ఆపివేసింది. హెజ్‌బొల్లా కూడా రాకెట్ దాడులను నిలిపివేసింది. ఈ క్రమంలోనే తాజాగా హర్మూజ్ జలసంధిని తెరిచామని ఇరాన్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20 శాతం హర్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఇటీవల యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ దీనిని మూసివేసింది. దీంతో చమురు సరఫరా ఆగిపోయి ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు హర్మూజ్ తెరుచుకోవడంతో చమురు ధరలు తగ్గనున్నాయి. ఈ పరిణామం వల్ల పశ్చిసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌తో పాటు.. ఇరాన్-లెబనాన్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నాయి. మరోవైపు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా రెండోసారి ఇరాన్‌తో చర్చలు ఉంటాయని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు