/rtv/media/media_files/2026/04/08/strait-of-hormuz-2026-04-08-12-47-05.jpg)
Iran, Oman to collect shipping fees in Strait of Hormuz during 2-week ceasefire, Report
ఇరాన్ నాగరికతను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మళ్లీ రెండు వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాము అడిగిన 10 షరతులు ఆచరణంగా ఉన్నట్లు అమెరికా కూడా అంగీకరించిందని ఇరాన్ తెలిపింది. ఈ షరతుల్లో హర్మూజ్‌పై ఇరాన్ నియంత్రణ అంశం కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరాన్-ఒమన్ దేశాలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఫీజు వసూలు చేసేందుకు ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది.
ఉత్తరాన ఇరాన్.. దక్షిణాన ఒమన్ దాక ఉన్నటువంటి హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉంది. ఇది 53 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. ఈ మార్గం నుంచే వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేసి దీనిద్వారా వచ్చిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి వాడుతామని ఇరాన్ అధికారి తెలిపారు. అయితే ఇప్పటిదాకా ప్రపంచదేశాలకు హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ మార్గంగా ఉండేది. ఈ రూట్ గుండా వెళ్లే నౌకలపై ఎలాంటి ఫీజు వసూలు చేసిద కాదు. కానీ ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరాన్ హర్మూజ్ జలసంధి వద్ద టోల్ వసూలు చేస్తోంది.
Also Read: నిప్పుల కొలిమిలా మారనున్న భూమి.. వందేళ్లుగా ఎన్నడూ లేని ఎండ తీవ్రత!
ఒక్క నౌకకు 2 మిలియన్ డాలర్లు
హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఒక్కో నౌకకు 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.16.8 కోట్లు) వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇందుకోసం ఏప్రిల్ 7న ఇరాన్ పార్లమెంట్ ఓ ముసాయిదా బిల్లును కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో (యుద్ధం లేని సమయంలో) హార్ముజ్ జలసంధి మార్గం గుండా రోజుకు సగటున 60 నుండి 85 వరకు వివిధ రకాల వాణిజ్య నౌకలు, భారీ చమురు ట్యాంకర్లు వెళ్తుంటాయి. అయితే, అయితే అన్ని రకాల చిన్న, పెద్ద నౌకలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ప్రతిరోజు100 దాటవచ్చు. కానీ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఈ నౌకల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. కొన్నిరోజులకు మళ్లీ ఈ నెంబర్ పాత స్థాయికి చేరుకునే ఛాన్స్ ఉంది.
ఉదాహరణకు ఒకరోజుకు హర్మూజ్ జలసంధి గుండా 80 నౌకలు వెళ్తే.. ఒక్కో నౌకకు 2 మిలియన్ డాలర్ల చొప్పున ఇరాన్‌కు 160 మిలియన్ డాలర్ల లాభం ఉంటుంది. అంటే మన భారత కరెన్సీలో రోజుకు రూ.1,344 కోట్ల ఆదాయం వస్తుంది. నెలకు రూ.40,320 కోట్లు, ఏడాదికి రూ.4,87,200 కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి దాదాపు రూ.4.8 లక్షల కోట్ల ఆదాయం వస్తే.. ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకోగలదు. కొన్ని రిపోర్టుల ప్రకారం.. హర్మూజ్ జలసంధి ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉంటుంది కాబట్టి ఈ టోల్ ఫీజులో కొంత భాగం ఒమన్‌కు కూడా వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇరాన్‌కు ట్రంప్ 5సార్లు 'డెడ్‌లైన్'.. అమెరికా (పొడిగింపు) పాలిటిక్స్
Follow Us