హర్మూజ్‌ జలసంధికి విముక్తి.. ఇరాన్‌తో ట్రంప్ కొత్త డీల్.. సంతకాలకు రెడీ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం చల్లబడుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ తన అణ్వాయుధాలను వదులుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

New Update
Donald Trump

Donald Trump

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం చల్లబడుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందంలోని ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ తన అణ్వాయుధాలను వదులుకోవడానికి సిద్ధపడినట్లు ట్రంప్ తెలిపారు. ఇకపై ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండదు. ఈ ఒప్పందం ఖచ్చితంగా ఇరు దేశాల మధ్య శాంతికి బాటలు వేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందంపై ఈ వారాంతంలో ఐరోపా దేశంలో సంతకాలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరుకానున్నారు.

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే హర్మూజ్ జలసంధి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఈ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒకసారి ఒప్పందం కుదిరి జలసంధి తెరుచుకుంటే ప్రపంచ చమురు మార్కెట్లపై ఉన్న ఒత్తిడి తగ్గి ఇంధన ధరలు స్థిరపడే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.  అయితే ఈ ఒప్పందంపై తాము ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పష్టం చేశారు. ఒప్పందం జరగబోతోందని అమెరికా ఒకవైపు చెబుతుంటే, మరోవైపు తాము ఇంకా చర్చల దశలోనే ఉన్నామని ఇరాన్ చెబుతోంది. 

ఇది కూడా చూడండి:Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస

Advertisment
తాజా కథనాలు