Iran: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. ఇద్దరిని ఉరితీసిన ఇరాన్

ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో శనివారం ఇరాన్‌ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తులను ఉరితీయడం కలకలం రేపుతోంది.  సెంట్రల్ ఇస్ఫాహాన్ ప్రావిన్స్ పరిధిలోని నటాంజ్ న్యూక్లియర్ స్థలం వద్ద ఇద్దరిని ఉరితీసింది.

New Update
Iran hangs two on charges of spying for Israel

Iran hangs two on charges of spying for Israel

ఇరాన్‌కు ఓవైపు అమెరికా-ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ తమ దేశంలో మాత్రం కఠిన చర్యలకు వెనకడుగు వేయడం లేదు. ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో శనివారం ఇరాన్‌ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తులను ఉరితీయడం కలకలం రేపుతోంది.  సెంట్రల్ ఇస్ఫాహాన్ ప్రావిన్స్ పరిధిలోని నటాంజ్ న్యూక్లియర్ స్థలం వద్ద ఇద్దరిని ఉరితీసింది. బాధితులను 'యగౌబ్ కరింపోర్', 'నాజర్ బకర్జాదే' గా గుర్తించారు. వీళ్లిద్దరూ ఇరాన్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు అందిచారని ఇరాన్ ఆరోపణలు చేస్తోంది.  

Also Read: ఓవైపు ఇరాన్‌తో యుద్ధం.. మరోవైపు మిత్రదేశాలకు ఆయుధాలు అమ్మి వ్యాపారం.. ట్రంప్ ప్లాన్ మామూలుగా లేదుగా !

ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ అయిన మొసాద్‌కు ఈ ఇద్దరు వ్యక్తులు ఇరాన్‌కు సంబంధించిన కీలక ప్రదేశాలు, న్యూక్లియర్ ప్లాంట్‌కు చెందెన సమాచారాన్ని అందించినట్లు ఇరాన్ తెలిపింది. ఈ నేరానికి పాల్పడ్డినందుకు ఇరాన్ కోర్టు వీళ్లిద్దరికీ మరణ శిక్ష విధించగా.. శనివారం దీన్ని అమలు చేశారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరిని ఉరితీయడం ఇది రెండోసారి. ఏప్రిల్ 20న కూడా మరో ఇద్దరు వ్యక్తులకు కూడా గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఉరిశిక్షను అమలు చేశారు. వీళ్లు ఇరాక్‌తో సహా విదేశాల్లో ట్రైనింగ్ తీసుకొని, ఇరాన్‌లో గూఢచర్యం చేస్తూ ఇజ్రాయెల్‌కు సమాచారం అందిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది.  

Also Read: మరో షాకిచ్చిన ట్రంప్.. ఆ దేశం నుంచి 5 వేల మంది సైనికులు ఔట్.. కారణం అదేనా?

మరోవైపు ఇరాన్‌లో అమలుచేస్తున్న మరణశిక్షలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా ఇరాన్.. కనీసం 21 మందిని ఉరితీసినట్లు తెలిపింది. అక్కడి భద్రతా కారణాల వల్ల 4 వేల మందికి పైగా అరెస్టు చేసినట్లు పేర్కొంది. కానీ ఇరాన్ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. 

Advertisment
తాజా కథనాలు