/rtv/media/media_files/2025/07/06/boiled-eggs-2025-07-06-20-02-42.jpeg)
Boiled eggs
ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి దారుణంగా మారింది. ఆర్థిక పరిస్థితి తగ్గుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌పై యుద్ధం మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం ఇరాన్ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యుద్ధం వల్ల పెరిగిన ఖర్చులు, తగ్గిన ఆదాయం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంతో పోలిస్తే ఆహార వస్తువుల ధరలు 112% పెరిగాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు 200% పైగా పెరగడం విశేషం. కేవలం ఆహారమే కాదు, చివరికి మనిషి చనిపోతే నిర్వహించే అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయి.
ఇది కూడా చూడండి: Washington Hilton Hotel : నాడు రొనాల్డ్, నేడు డొనాల్డ్...,అదే హోటల్..45 సంవత్సరాల తర్వాత సీన్ రిపీట్
یک شهروند درباره کاهش قدرت خرید مردم در پیامی به ایران اینترنشنال گفت که قیمت هر دانه تخم مرغ به ۲۰ هزار تومان افزایش پیدا کرده و «هیچ چیز نمیشود خرید.» pic.twitter.com/0OzYUs1Ltp
— ايران اينترنشنال (@IranIntl) April 25, 2026
ఇది కూడా చూడండి: Iran leadership crisis : ఇరాన్ నాయకత్వంలో చీలిక... సైన్యం వర్సెస్ రాజకీయ వర్గం
పాతాళానికి పడిపోయిన రియాల్ విలువ..
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో అధికారికంగా 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ అసలు సంఖ్య 20 నుంచి 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. సుమారు 1.5 కోట్ల మంది ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయ మార్గం లేదు. ప్రభుత్వం ఇచ్చే సాయం లేదా ఫుడ్ వోచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా కొనలేని దుస్థితి నెలకొంది. ఇరాన్ కరెన్సీ అయిన 'రియాల్' విలువ పాతాళానికి పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ విలువ ప్రస్తుతం సుమారు 16 లక్షల రియాల్స్‌కు చేరుకుంది. దీనివల్ల ప్రజలు దాచుకున్న సొమ్ము కళ్లముందే ఆవిరైపోతోంది. ప్రజల దగ్గర డబ్బు లేకపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రెస్టారెంట్లు, చిన్న దుకాణాలు మూతపడుతున్నాయి.
ఇది కూడా చూడండి: Donald Trump : వైట్ హౌజ్ సమీపంలో కాల్పులు...ఆ సమయంలో అదే హోటల్‌లో కేఏ పాల్
ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం పన్నులు తగ్గించకపోగా, లోన్ కట్టడం ఆలస్యమైతే భారీగా జరిమానాలు విధిస్తోంది. ముఖ్యంగా ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్‌కు చేరింది. గతంలో రూ. 50-60 వేల రియాల్స్‌గా కోడి గుడ్డు ధర ఉండేది. కానీ యుద్ధం కారణంగా ఈ ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ చరిత్రలోనే మొదటిసారి టెహ్రాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వరుసగా 8 వారాల పాటు మూతపడింది. ఆ దేశానికి వెన్నెముక లాంటి పెట్రోకెమికల్, స్టీల్ పరిశ్రమలు దెబ్బతినడంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా పతనమైంది. యుద్ధం వల్ల ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పడిపోవడంతో ఇరాన్‌లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చూడండి: Murder : అమెరికాలో పరిశోధనా విద్యార్థుల హత్య! స్నేహితుడే హంతకుడు..
Follow Us