/rtv/media/media_files/2026/03/28/ban-2026-03-28-15-30-29.jpg)
పిల్లల భవిష్యత్తు కోసం ఇండోనేషియా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పిల్లలు ఎక్కువగా వాడే YouTube, TikTok, Facebook, Instagram, Threads, X, Bigo Live, Roblox వంటి ప్లాట్‌ఫామ్‌లలో 16 ఏళ్ల లోపు వారు అకౌంట్లు తెరవకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఆగ్నేయాసియాలో ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్న మొదటి దేశం ఇండోనేషియానే కావడం విశేషం. అంతకుముందు ఆస్ట్రేలియా మాత్రమే ఇలాంటి చట్టాన్ని తెచ్చింది.
🇮🇩 Indonesia bans social media for under 16, 1st in Asia.
— World of Statistics (@stats_feed) March 28, 2026
Indonesia's ban on social media for children under 16 took effect Saturday, barring them from creating and holding accounts on online platforms in an effort to protect minors from cyberbullying, digital addiction and…
7 కోట్ల మంది పిల్లలపై ఎఫెక్ట్
ఇండోనేషియా కమ్యూనికేషన్, డిజిటల్ వ్యవహారాల మంత్రి మ్యుత్య హఫీద్ మాట్లాడుతూ.. "ఈ నిబంధనలను పాటించడంలో ఎటువంటి రాజీ ఉండదు. అన్ని సోషల్ మీడియా కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల అకౌంట్లను తొలగించాలి" అని స్పష్టం చేశారు. సుమారు 7 కోట్ల మంది పిల్లలపై ఈ ప్రభావం పడనుంది. ఇది కష్టమైన పనే అయినప్పటికీ, పిల్లల క్షేమం కోసం తప్పదని ఆమె అన్నారు.
సెజివా అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డీనా హర్యానా మాట్లాడుతూ.. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో ఒత్తిడి, డిప్రెషన్ పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. పిల్లలు డిజిటల్ ప్రపంచంలో కాకుండా నిజమైన ప్రపంచంలో ఆడుకుంటూ ఎదిగేలా తల్లిదండ్రులు, పాఠశాలలు ప్రోత్సహించాలని ఆమె సూచించారు. దీనిపై ఎలన్ మాస్క్ స్పందిస్తూ.. "ఇది మా ఇష్టం కాదు, ఇండోనేషియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండితేనే అకౌంట్ ఇస్తాం" అని పేర్కన్నారు.
Follow Us