/rtv/media/media_files/2025/03/10/MVNQGkJsdBGN6cUPdaOB.jpg)
Cyber Crime
మయన్మార్‌లో జరుగుతున్న సైబర్ స్కాం కార్యక్రమంలో వందలాది మంది భారతీయులు చిక్కుకుని అక్కడే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాళ్లకు విముక్తి లభించింది. 500 మందికి పైగా భారతీయులను అక్కడి యంత్రాంగం కాపాడింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్నవాళ్లు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. వీళ్లు మొదటగా థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్నారు.
Also Read: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
వీళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవాళ్లు కూడా ఉన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో వీళ్లను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. భద్రతా వ్యవస్థ లోపం కారణంగా మయన్మార్ సరిహద్దుల్లో సైబర్ కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ వ్యవహారంలో చైనా నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో ఇటీవలే అక్కడ స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. చైనాతో పాటు వివిధ దేశాలకు చెందిన వేలాది మందిని సైబర్ నేరగాళ్ల నుంచి విడిపించారు.
Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్
వీళ్లలో భారత్‌కు చెందినవారు 500 మందికి పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సుల్లో థాయ్‌లాండ్ నుంచి మయన్మార్‌లోకి భారత అధికారులు ప్రవేశించారు. ఆ తర్వాత వాళ్లని తిరిగి తీసుకొచ్చారు. అయితే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం సీ-17 రవాణా విమానాన్ని పంపించింది. తొలి విడుతలో 266 మంది పురుషులు, 17 మంది మహిళలు భారత్‌కు వచ్చారు. ఇక మంగళవారం మరో 257 మంది స్వదేశానికి తిరిగిరానున్నారు.
Also Read: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?
Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్ షాక్.. రావడం కష్టమే