పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌లో మూతబడుతున్న యూరియా ప్లాంట్లు

పశ్చిమాసియాలో యద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు కొరత ఎదుర్కొంటున్నాయి. యూరియా తయారీ సంస్థలపై ఈ యుద్ధ ప్రభావం గట్టిగా ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి.

New Update
Indian urea producers shut plants as Iran war cuts LNG flows

Indian urea producers shut plants as Iran war cuts LNG flows

పశ్చిమాసియాలో యద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు కొరత ఎదుర్కొంటున్నాయి. యూరియా తయారీ సంస్థలపై ఈ యుద్ధ ప్రభావం గట్టిగా ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. యూరియా ఉత్పత్తికి కావాల్సిన ద్రవరూప సహజ వాయువు (LNG)ను ఇండియా గత కొన్నేళ్లుగా ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల  LNG సరఫరా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు యూరియా కంపెనీల ప్లాంట్లు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి.  

Also Read: ఇరాన్ యుద్ధంతో భారత్‌లో సంక్షోభం..దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు

ఎరువులు తయారు చేసేందుకు LNG అనేది కీలకమైన ముడిసరకు. దీంతోనే దేశంలో అనేక యూరియా ఉత్పత్తి సంస్థలు ఎరువులను తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం ఎరువుల తయారీకి కావాల్సిన దాంట్లో 70 శాతం వరకు మాత్రమే గ్యాస్‌ నిల్వలు మనవద్ద ఉన్నాయి. ఈ క్రమంలోనే యూరియాను ఉత్పత్తి చేసేందుకు భారత్‌కు చెందిన సంస్థ ఇండియన్ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్స్‌ పలు ప్లాంట్లను క్లోజ్ చేసింది. మరికొన్నింట్లో ప్రొడక్షన్‌ను తగ్గించింది. 

Also Read: యుద్ధకాలం..గ్యాస్ కొరత..ఇలా చేస్తే  మీ వంట గ్యాస్‌ బోలెడంత ఆదా..!

భారత్‌ వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడుతుంది. దేశంలో వర్షకాలంలో ఎరువులకు భారీగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే LNG సరఫరా ఆగిపోవడంతో ఇతర దేశాల నుంచి యూరియాను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రభావంతో ప్రపంచ మార్కెట్‌లో యూరియా ధరలు పెరుగుతాయి. దీంతో ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై కూడా ఎఫెక్ట్‌ పడే ఛాన్స్ ఉంటుంది. యూరియా కొరతతో వ్యవసాయ ఉత్పాదక ఖర్చులు కూడా పెరుగుతాయి. చివరికి ద్రవ్యోల్బణం కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు