Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలని అనుకునే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ హెచ్చరికలు చేశారు. అక్కడ నాసికరం విద్యా సంస్థల వల్ల ఉద్యోగాలు రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకంటున్నారని తెలిపారు. By B Aravind 26 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఉన్నత చదువులు కోసం చాలామంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో చదువుకోవాలనుంటారు. అయితే ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలని అనుకునే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ హెచ్చరికలు చేశారు. అక్కడ నాసిరకం విద్యా సంస్థల వల్ల చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. Also read: భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. ఎందుకంటే ? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనివల్ల విద్యార్థులు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని సంజయ్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కెనడాకు తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం పంపించాలనుకునే తల్లిదండ్రులు దీనిపై ముందు ఆలోచించుకోవాలని సూచనలు చేశారు. '' నాలుగురేట్లు అధికంగా ఫీజులు వెచ్చించి చదువుకున్నా కూడా అక్కడ ఉద్యోగాలు రాక విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. Also Read : పుష్ప2 క్రేజ్.. ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్.. RRR రికార్డ్స్ బ్రేక్ వారానికే ఒక్కసారే క్లాసులు ఒకనొక దశలో వారానికి కనీసం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను కెనడా నుంచి ఇండియాకు తరలించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అక్కడ కళాశాలల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వాటిల్లో తమ పిల్లలను చదివించే అంశంపై తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వారానికి ఒక్కసారి మాత్రమే జరిగే కళాశాలలు, అంతగా వాటి గురించి తెలియని వాటిల్లో విద్యార్థులను చేర్పించవద్దు. ఇలాంటి పరిస్థితులకు దళారులు కూడా ఓ కారణమే. Also Read: అధిక బరువు ఉన్నవారికి వచ్చే సమస్యలు ఇవే! తీవ్రవాద భావజాలం కెనడాలో ఇంజినీరింగ్ పూర్తి చేస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని అందరూ భావిస్తారు. కానీ అక్కడ ఇందుకు భిన్నంగా క్యాబ్ డ్రైవర్‌గానో, చాయ్, సమోసా విక్రయిస్తూనో జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కెనడాలో చదువుతున్న భారత విద్యార్థులు తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖలిస్థానీలు, ఇతర వేర్పాటువాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీళ్లందరూ విద్యార్థులకు డబ్బులు, ఆహారం ఎరగా వేసి ప్రభావితం చేస్తారని'' సంజయ్ వర్మ అన్నారు. ఇదిలాఉండగా 2022 నుంచి కెనడాలో సంజయ్ వర్మ భారత హైకమిషనర్‌గా ఉన్నారు. ఇటీవల ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా వివాదాలు తలెత్తడంతో ఆయన ఇటీవలే భారత్‌కు తిరిగివచ్చేశారు. Also Read : కోతికి యావజ్జీవ శిక్ష.. ఎందుకో తెలుసా..? #telugu-news #canada #indian-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి