జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మిని స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లు స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. అలాగే, భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉగ్రదాడిలో దాదాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.
Also Read:Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!
పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన ట్రంప్.. ఈ ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. .గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
అటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు. ‘ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదు. ఈ దాడి వెనకున్న ఎంతటివారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆశిస్తున్నా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌తో మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా" అని పుతిన్ అన్నారు.
భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా ఈ దాడి గురించి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిని వినాశకర ఉగ్ర దాడిగా అభివర్ణించారు. ‘భారత్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనపై బాధిత కుటుంబాలకు నేను, ఉషా సంతాపం తెలుపుతున్నాం... కొన్ని రోజులుగా మేం ఈ దేశం అందాలు, భారతీయుల అభిమానానికి ఎంతో ముగ్దులయ్యాం.. ఈ భయానక దాడితో చనిపోయివారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం’ ఈ మేరకు ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై వాన్స్ స్పందించారు.
కశ్మీర్ ఘటనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ‘జాతీయ భద్రతా సలహాదారు ద్వారా సమాచారం అందింది. దీనిపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడికి సమాచారం అందిస్తున్నాం.. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. దక్షిణ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడిలో 28 మంది చనిపోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ తక్షణమే ప్రధాని మోదీతో మాట్లాడి ప్రాణాలు కోల్పోయినవారికి తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తారు.
బాధితులకు, మా మిత్రదేశమైన భారత్‌కు మేము మద్దతుగా నిలుస్తాం.. ఇలాంటి భయానక ఉగ్రవాద దాడులే ప్రపంచంలో శాంతి, స్థిరత కోసం పనిచేస్తున్న మేమందరం మా కృషిని కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి..." అని పేర్కొన్నారు.
జమ్మూ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు నిర్వహించే లష్కరే తొయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ దాడికి పాల్పడింది. ఈ ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటనతో కశ్మీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: Ap: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?
Also Read: J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !
trump | putin | russia | america | Pahalgam attack | latest-news