India-USA Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. సంతకాలు జరిగేది అప్పుడే : పియూశ్‌ గోయల్

భారత్‌-అమెరికా మధ్య ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం తొలి దశపై మార్చిలో సంతకాలు జరగే అవకాశం ఉందని తెలిపారు.

New Update
India to sign trade deal with United States in March, Says Piyush goyal

India to sign trade deal with United States in March, Says Piyush goyal

భారత్‌-అమెరికా మధ్య ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం తొలి దశపై మార్చిలో సంతకాలు జరగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఇరుదేశాల సంయుక్త ప్రకటన 45 రోజుల్లోనే వస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ సంతకాలు జరిగిన ఒకట్రెండు రోజుల్లోనే అమెరికా జారీ చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ ద్వారా మన ఉత్పత్తులపై 18 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయి. 

Also Read: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అనురాగ్ ఠాకూర్‌పై నిషేధం ఎత్తివేత!

ప్రస్తుతం భారత్‌పై అమెరికా 50 శాతం సుంకం వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య లీగల్ ఒప్పందం జరిగిన తర్వాత భారత్‌పై టారిఫ్‌ తగ్గింపు అమల్లోకి వస్తాయని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు.  ప్రస్తుతం అధికారిక ఒప్పంద ముసాయిదా పనులు జరుగుతున్నట్లు పియూశ్ గోయల్ తెలిపారు. దీనికోసం నెలకు పైగా సమయం పట్టే ఛాన్స్ ఉందని అన్నారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి దశపై మార్చిలోనే సంతకాలు జరగొచ్చని గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంలో ఎలాంటి పెట్టుబడుల అంశాలు లేవన్నారు. 

లీగల్ ఒప్పందం తర్వాత ఈ ఉత్పత్తులపై సుంకాల్లో మరిన్ని తగ్గింపులు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. భారత్‌లో విమానాలకు గిరాకీ ఎక్కువగా ఉందని.. బోయింగ్‌ సంస్థకు ఇప్పటికే మన కంపెనీలు ఆర్డర్లు ఇచ్చాయని పేర్కొన్నారు. ఇంకా 70 నుంచి 80 బిలియన్‌ డాలర్ల ఆర్డర్లు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. ఇక ఇంజిన్లు, ఇతర విడిభాగాలు కలిపితే 100 బిలియన్ డాలర్ల విమాన కొనగోళ్లు ఉంటాయని అంచనా వేశారు. 

Also Read: ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు.. చరిత్రలో మొదటిసారిగా

ప్రస్తుతం చూసుకుంటే భారత్‌ కొనుగోళ్ల విలువ 300 బిలియన్ డాలర్లుగా (రూ.27 లక్షల కోట్లు) ఉంది. వచ్చే అయిదేళ్లలో వీటి విలువ 2 లక్షల కోట్ల డాలర్లకు(రూ.180 కోట్లు) చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే చమురు, LPG, LNG, ఐసీటీ ఉత్పత్తులు, డేటా సెంటర్ సామాగ్రి లాంటివి అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నాం. దాదాపు 25 శాతం దిగుమతులు అమెరికా నుంచే వస్తాయి.   

Advertisment
తాజా కథనాలు