G7: వరల్డ్ పవర్‌ఫుల్ దేశాలకు భారత్ కింగ్ మేకర్.. జీ7లో ఎందుకంత ఇంపార్టెంట్ అంటే?

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే జీ7 కూటమిలో భారత్‌ అధికారిక సభ్యదేశం కాదు. అయితే వరుసగా ఎనిమిదోసారి ప్రత్యేక ఆహ్వానం అందుకోవడంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

New Update
FotoJet (9)

G7

ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లెస్-బైన్స్ నగరంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల కూటమి ‘జీ7’ (G7) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ యుద్ధాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా ఈ 3 రోజుల సదస్సు సాగుతోంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే జీ7 కూటమిలో భారత్‌ అధికారిక సభ్యదేశం కాదు. అయితే వరుసగా ఎనిమిదోసారి ప్రత్యేక ఆహ్వానం అందుకోవడంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. మరి సభ్య దేశం కాకపోయినా జీ7లో భారత్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాం.

 ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ లాంటి యుద్ధాలు నడుస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి జీ7 దేశాలన్నీ రష్యాకు శత్రువులు. కానీ భారతదేశానికి అటు అమెరికాతోనూ, ఇటు రష్యాతోనూ సమానంగా అద్భుతమైన స్నేహ బంధం ఉంది. రెండు శత్రు వర్గాలతోనూ నేరుగా మాట్లాడగలిగే నమ్మకమైన దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటే. అందుకే యుద్ధాలకు ముగింపు పలకాలంటే భారత్ రాయబారం చాలా అవసరమని జీ7 భావిస్తోంది.

ఇది కూడా చూడండి: Crime News : ముస్సోరీ హనీమూన్‌లో విషాదం... ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

భారత్ ఎప్పుడూ ఏ వైపూ చేరకుండా.. శాంతి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్తూ వస్తోంది. ఇది యుద్ధాల యుగం కాదు అని ప్రధాని మోదీ గతంలోనే కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే కీలక తరుణంలో, మధ్యప్రాచ్య సంక్షోభాన్ని పూర్తిగా ముగించడానికి జెనీవాలో జరగబోయే తుది చర్చలకు భారత్ మధ్యవర్తిత్వం వహిస్తేనే బాగుంటుందని అగ్రదేశాలు భావిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!

ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటుంటే.. భారత్ మాత్రం అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలన్నా, పర్యావరణ మార్పులపై పోరాడాలన్నా భారత్ భాగస్వామ్యం అత్యంత కీలకం.

ఇది కూడా చూడండి: Lashkar Bonalu Jatara 2026 : లష్కర్ బోనాల జాతర 2026...ఉత్సవాల షెడ్యూల్ విడుదల!

జీ7లో ఉన్నవన్నీ సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలే. కానీ ప్రపంచ జనాభాలో ఎక్కువ భాగం ఉన్న ఆసియా, ఆఫ్రికా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున మాట్లాడే ఏకైక గ్లోబల్ లీడర్ ప్రధాని మోదీ మాత్రమే. అందుకే ప్రపంచంలో సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే భారత్ లాంటి బలమైన దేశం ఈ సదస్సులో ఉండటం జీ7కు కూడా ఎంతో అవసరం.

Advertisment
తాజా కథనాలు