కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విదేశాంగ శాఖ

భారత్‌పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలపై మరోసారి విదేశాంగశాఖ స్పందించింది. కెనడా ఎలాంటి ఆధారాలు కూడా ఇవ్వలేదని... రాజకీయాల కోసమే భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారంటూ మండిపడింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
jaishwal

గత కొంతకాలంగా భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన విభేధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బుధవారం కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందనేది సమాచారమే తప్పా పక్కా ఆధారాలు లేవని ట్రూడో చెప్పాడు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ ట్రూడో తీరుపై కౌంటర్ ఇచ్చింది. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి మేము ఎంతోకాలంగా చెబుతున్న విషయమే రుజువైందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. భారత్ - కెనడా మధ్య సంబంధాలు దిగజారడానికి జస్టిన్ ట్రోడోనే పూర్తి బాధ్యుడు అంటూ మండిపడ్డారు.  

Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

భారత ప్రతిష్టను దెబ్బతియాలనే

అయితే తాజాగా మరోసారి రణ్‌ధీర్ జైశ్వాల్‌ కెనడాకు సంబంధించిన వ్యవహారంపై మీడియాతో పలు కీలక విషయాలు వెల్లడించారు. '' కెనడా ఎలాంటి ఆధారాలు కూడా ఇవ్వలేదు. రాజకీయాల కోసమే భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారు. కెనడా చేసిన ఈ ఆరోపణలు ఖండిస్తున్నాం. భారత ప్రతిష్టను దెబ్బతీయాలనే పక్కా ప్రణాళికతో ఇలా చేశారు. మేము చేసిన 26 అప్పగింతల అభ్యర్థలను పెండింగ్‌లో ఉన్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల్ని తిరిగి అప్పగించాలని కోరాం.  కెనడా వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని'' రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు. 

Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు

భారత ఏజెంట్ల హస్తం

 ఇదిలాఉండగా.. గత ఏడాది జూన్‌ 18న కెనడాలో ఖలీస్తాన్ మద్దతుదారు హర్దీప్‌ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రోడో నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో భారత్‌ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా విభేదాలు నెలకొన్నాయి. భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తలు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కొంతకాలంగా విభేదాలు నెలకొన్న నేపథ్యంలో అక్టోబర్ 16న కెనడా ప్రధాని జస్టీన్ ట్రోడో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!

 గత ఏడాది నిజ్జర్‌ను హత్యచేయడంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసిన సమయంలో తన వద్ధ నిఘా సమాచారం మాత్రమే ఉందని పక్కా ఆధారాలు లేవంటూ ఎట్టకేలకు అంగీకరించారు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విదేశాల జోక్యంపై విచారణ చేస్తున్న కమిటీ ముందు ట్రూడో ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈసారి భారత్‌పై మళ్లీ అభ్యంతరకర ఆరోపణలు చేశారు. భారత ప్రధాని నేతృత్వంలో ప్రభుత్వంలో విభేదిస్తున్న కెనడావారి వివరాలను ఇక్కడి భారత దౌత్యవేత్తలు సేకరిస్తున్నారని.. వాటిని ఉన్నతస్థాయిలో ఉన్నవారికి, లారెన్స్ బిష్ణోయ్ వంటి నేరగాళ్ల ముఠాలకు చేరవేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవంటూ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. 

Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

Advertisment
Advertisment
తాజా కథనాలు