Imran Khan : 85 శాతం కంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఆయన, తన కుడి కంటి చూపును దాదాపు కోల్పోయినట్లు తెలుస్తోంది.

New Update
imran khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఆయన, తన కుడి కంటి చూపును దాదాపు కోల్పోయినట్లు తెలుస్తోంది. కోర్టు నియమించిన లాయర్ సల్మాన్ సఫ్దర్ అందించిన నివేదిక ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌కు ప్రస్తుతం కుడి కంటిలో కేవలం 15 శాతం చూపు మాత్రమే మిగిలి ఉంది.

పదే పదే ఫిర్యాదు

గత ఏడాది అక్టోబర్ నుంచే తన కంటి చూపు మందగిస్తోందని, వస్తువులు మసకగా కనిపిస్తున్నాయని ఇమ్రాన్ జైలు అధికారులకు పదే పదే ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారని, సరైన సమయంలో ట్రీట్‌మెంట్ అందించలేదని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా కుడి కంటిలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి చూపు దారుణంగా దెబ్బతింది. ఇటీవల ఆయనకు జైలు వెలుపల ఒక ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పాకిస్థాన్ సుప్రీంకోర్టు, ఇమ్రాన్ ఖాన్ కోసం తక్షణమే ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 16లోపు ఆయనకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే జైల్లో ఉన్న ఇమ్రాన్ తన పిల్లలతో ఫోన్ లో మాట్లాడుకునేందుకు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న ఇమ్రాన్, సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతుండటంపై ఆయన పార్టీ (PTI) నేతలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు