అండమాన్‌ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పడవ బోల్తా పడి 250 మంది గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ఓ నౌక బంగ్లాదేశ్‌ నుంచి మలేసియాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

New Update
Hundreds missing after Rohingya refugee boat capsizes in Andaman Sea

Hundreds missing after Rohingya refugee boat capsizes in Andaman Sea

అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పడవ బోల్తా పడి 250 మంది గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ఓ నౌక బంగ్లాదేశ్‌ నుంచి మలేసియాకు వెళ్తోంది. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి ఈ పడవ బయలుదేరింది. అండమాన్ సముద్రం వద్దకు వచ్చేసరికి వాతావరణం అనుకూలించకపోవడం, సామర్థ్యానికి మించి ఆ బోటులో ప్రయాణికులు ఉండటం వల్ల ఆ పడవ బోల్తా పడినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతం ఆ సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఎక్కవమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR) వెల్లడించింది. 

Also read: 180 బాలికలను లైంగికంగా వేధించిన యువకుడు.. 350 పైగా అశ్లీల వీడియోలు

మయన్మార్‌లో హింసను తట్టుకోలేక 2017లో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు. అక్కడ కాక్స్‌ బజార్‌లోని శిబిరాల్లో ఉంటున్నారు. కానీ ఈ మధ్య అక్కడ సరైన జీవన సౌకర్యాలు ఉండటం లేదు. పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ శిబిరాల్లో ఉన్నవారు మెరుగైన భవిష్యత్తు కోసం అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సముద్ర మార్గం గుండా మలేసియా లాంటి దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 4న బంగ్లాదేశ్‌ నుంచి ఆ పడవ బయలుదేరింది. బలమైన ఈదురు గాలుల వల్ల తాజాగా సముద్రంలో మునిగిపోయింది. 

Also Read: దక్షిణాది ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?

ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. శరణార్థుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని కోరాయి. ఇలాంటి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మరికొన్ని సంస్థలు సూచిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు