El Mencho : పక్కా ప్లాన్.. చిక్కిన డాన్! లవర్ కదలికలే డ్రగ్ లార్డ్ కొంపముంచాయా?

మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా నాయకుడు ఎల్ మెంచో అని పిలవబడే నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వాంటెస్ సైనిక కాల్పుల్లో మరణించారు. మెక్సికో భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
mexico

మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా నాయకుడు ఎల్ మెంచో(El Mencho) అని పిలవబడే నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వాంటెస్ సైనిక కాల్పుల్లో మరణించారు. మెక్సికో భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో అతని అనుచరులు మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించారు.

ఈ డ్రగ్ మాఫియా డాన్ ఎక్కడున్నాడో కనిపెట్టడానికి అధికారులు చాలా తెలివిగా వ్యవహరించారు. ఎల్ మెంచోకు అత్యంత సన్నిహితురాలైన ఒక మహిళ కదలికలను నిఘా సంస్థలు నిరంతరం గమనించాయి. ఆమె వెళ్తున్న ప్రాంతాన్ని బట్టి, జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పా అనే కొండ ప్రాంతంలో ఎల్ మెంచో దాక్కున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా నిఘా సంస్థలు కేవలం సమాచారాన్ని మాత్రమే పంచుకున్నాయని, తమ సైన్యం మాత్రమే నేరుగా పాల్గొందని మెక్సికో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read :  నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అనుచరులు ఒక్కసారిగా కాల్పులు

సైన్యం ఆ ప్రాంతాన్ని ముట్టడించిన సమయంలో ఎల్ మెంచో అనుచరులు ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. అడవిలోకి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ ఘర్షణలో ఎల్ మెంచోతో పాటు అతని ఇద్దరు అంగరక్షకులు కూడా గాయపడి చనిపోయారు. ఈ వార్త తెలియగానే అతని గ్యాంగ్ సభ్యులు రెచ్చిపోయారు. రోడ్లను దిగ్బంధించి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దాడుల్లో సుమారు 25 మంది జవాన్లు, 30 మంది గ్యాంగ్ సభ్యులు చనిపోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మెక్సికో ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బామ్ ప్రకటించారు. అమెరికాకు మత్తు పదార్థాలను సరఫరా చేయడంలో ఎల్ మెంచో కీలక పాత్ర పోషించేవాడు. అతని మరణం మెక్సికో నేర ప్రపంచంలో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు.

Also Read :  అట్టుడుకుతున్న మెక్సికో... మాఫియా డాన్ మృతితో రెచ్చిపోయిన అనుచరులు

Advertisment
తాజా కథనాలు