/rtv/media/media_files/2026/03/01/how-israel-us-strikes-targeted-khamenei-and-his-inner-circle-2026-03-01-20-02-57.jpg)
How Israel-US Strikes targeted khamenei and his inner circle
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. అమెరికా భారీ ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసింది. ఖమేనీయే టార్గెట్‌గా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం అలీ ఖమేనీ తన కీలక సలహాదారులైన షాంఖానీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీతో సమావేశమయ్యారు. ఈ భేటీయే అమెరికా దాడులు చేసేలా చేసింది. వాస్తవానికి కొన్ని నెలల నుంచే నిఘా సంస్థ సీఐఏ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌తో కలిసి ఖమేనీ కదలికలపై నిఘా పెట్టింది.
Also Read: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్
ఖమేనీ పాలన భవనాల్లో ఓ దగ్గర శనివారం ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం వచ్చింది. అక్కడ దాడి చేయాలని ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ అక్కడ ఖమేనీ ఉన్నారో లేదో సరైన సమాచారం లేదు. ఆ భేటీ కూడా శనివారం సాయంత్రం జరగాల్సి ఉన్నప్పటికీ.. తర్వాత అది ఉదయానికి మారినట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. అదే రోజు మూడు భేటీలు జరగనున్నట్లు తెలిసింది. అలాగే ఖమేనీ లొకేషన్ కూడా తెలిసింది. దీంతో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఖమేనీ నివాస కాంప్లెక్స్‌పై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలోనే ఖమేనీ, అతడి కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్‌ను కూడా టార్గెట్ చేసుకున్నారు. కానీ ఇతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: ఇరాన్ రాజధాని టెహ్రాన్ టార్గెట్...బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
అయితే ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐ వాడినట్లు తెలుస్తోంది. అలాగే ఇంటెలిజెన్స్ అసిస్టెన్స్, యుద్ధ పరిస్థితులు అంచనా వేయడం లాంటి సేవలకు పెంటగాన్‌కు కూడా వాడింది. ఇప్పటికే పాలంటైర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి అమెరికన్ ఆర్మీకి ఆంథ్రోపిక్ సేవలు అందిస్తోంది. కానీ అమెరికా రక్షణశాఖతో విభేదాలు వల్ల ఆంథ్రోపిక్‌ను ఫెడరల్ ఏజెన్సీల్లో ఉపయోగించడం నిషేధించారు.
Follow Us