BIG BREAKING: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. 16 ఏళ్ల హిందూ బాలుడి హత్య

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులపై ఈ దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో హిందువును హత్య చేయడం కలకలం రేపుతోంది. ఫెనీ జిల్లాలోని కొందరు దుండగులు 16 ఏళ్ల హిందూ బాలుడిని దారుణంగా హత్య చేశారు

New Update
Hindu teen fatally struck by vehicle during robbery in Bangladesh's Feni

Hindu teen fatally struck by vehicle during robbery in Bangladesh's Feni

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులపై ఈ దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో హిందువును హత్య చేయడం కలకలం రేపుతోంది. ఫెనీ జిల్లాలోని కొందరు దుండగులు 16 ఏళ్ల హిందూ బాలుడిని దారుణంగా కొట్టి హత్య చేశారు. లాల్‌పోల్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మియాజీ ఫిల్లింగ్ స్టేషన్‌లో శాంతో కుమార్ సాహా (16) అనే బాలుడు తన ఆటోలో ఉన్నాడు. ఓ ప్రయాణికుడి కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. ఆటోను లాక్కునేందుకు యత్నించారు. శాంతో కుమార్‌ వాళ్లని అడ్డుకునేందుకు యత్నించడంతో హైవే పక్కనున్న కల్వర్టు కిందకి తోసేశారు.  ఆ తర్వాత కూడా వాళ్లు శాంతోను వెంబడించి పట్టుకున్నారు. రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ వాహనం కిందకి తోశారు. దీంతో ఆ వాహనం ఢీకొని ఆ బాలుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: యాసిడ్‌ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

 సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇఫ్తార్‌ సమయంలో దుండగులు శాంతోని టార్గెట్‌ చేసి ఆటో ఎత్తుకెళ్లినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. 

Also Read: బహ్రెయిన్ చమురు శుద్ధి కర్మాగారం బాప్కోపై ఇరాన్‌ అటాక్‌..నిలిచిపోయిన ఇంధన శుద్ధి

ఇదిలాఉండగా గత శనివారం కూడా కోమిల్లా ప్రాంతంలోని పూజలు చేసుకుంటున్న హిందువులపై కొందరు దుండగులు బాంబులు విసిరి పారిపోయారు. అక్కడ ఒక్కసారిగా మంటలు చెరగేడంతో అక్కడున్న హిందువులు భయంతో పారిపోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇటీవల మహమ్మద్ యూనస్ పాలనలో మైనార్టీలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఎన్‌పీ ప్రభుత్వ హయాంలో కూడా హిందువులపై దాడులు, హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు