/rtv/media/media_files/2025/03/14/9L9TFqTZsrrHDO7ppw5E.jpg)
Pakistan Train Hijack
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో జరిగిన ట్రైన్ హైజాక్ ఘటనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మిలిటెంట్ల చెర నుంచి బయటపడ్డ బందీలు.. తాము అనుభవించిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు ముందుగా రైలు ఇంజిన్ కింద పేలుడు పదార్థాలు పెట్టడం వల్ల బోగీలు పట్టాలు తప్పినట్లు రైలు డ్రైవర్ అమ్జాద్ తెలిపారు. రైలు ఆగడంతో ఉగ్రవాదులు కీటికీలు పగలగొట్టి ఆయుధాలతో లోపలికి వచ్చారని.. అసలు ఏం జరిగిందో తమకు అర్ధం కాలేదని వాపోయారు.
Also Read: తమిళనాడులోనూ లిక్కర్ స్కామ్.. మొత్తం వేయి కోట్లు.. షాకింగ్ విషయాలు!
అలాగే తమను రక్షించడం కోసం యత్నించిన సైనికులను కూడా దారుణంగా హత్య చేశారన్నారు. పారిపోయేందుకు యత్నించిన ప్రయాణికులను కూడా కాల్చి చంపారని.. దీంతో భయంతో మేము అక్కడే ఉండిపోయినట్లు తెలిపారు. చిన్నారులు, మహిళలపై కూడా మిలిటెంట్లు దాడి చేశారన్నారు. మరో ప్రయాణికుడు హమబూబ్ అహ్మద్ కూడా మాట్లాడారు. '' వేర్పాటువాదులు మమ్మల్ని బందీలుగా చేసుకోవడంతో జీవితంపై ఆశలు వదులుకున్నాం. ట్రైన్‌లో మృతదేహాలు చూసి వణికిపోయాం.
మమ్మల్ని మారుమూల పర్వత ప్రాంతాల్లోకి గంటల తరబడి నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఆ తర్వాత వివిధ ప్రదేశాల్లో బంధించారు. 27 గంటల పాటు మోకాళ్లపైనే కదలకుండా కూర్చోబెట్టారు. నీళ్లు తప్ప ఎలాంటి ఆహారం కూడా ఇవ్వలేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నా పట్టించుకోలేదు. పాక్ భద్రతా దళాలు మమ్మల్ని విడిపించేందుకు తీవ్రంగా శ్రమించాయి. వాళ్లకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని'' అన్నారు.
Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో...
ఇదిలాఉండగా బలోచిస్థాన్ వేర్పాటు వాదులు దాదాపు 500 మందితో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద రైల్వే ట్రాక్‌ను పేల్చి తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు పాక్ సైన్యం 80 మందిని సురక్షితంగా వాళ్ల నుంచి రక్షించింది. మిలిటెంట్ల అదుపులో ఇంకా వంద మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లను పాక్ సైనికులు హతం చేసినట్లు అధికారులు చెప్పారు.
Also Read: ట్రైన్ హైజాక్‌లో భారత్ హస్తముందున్న పాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా