BIG BREAKING: అమెరికా సంచలన ప్రకటన.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులకు సిద్ధం

మిడిల్‌ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన అప్‌డేట్‌ వచ్చింది. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఆ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సె్త్ వెల్లడించారు.

New Update
Hegseth says today will be 'most intense' of US war on Iran

Hegseth says today will be 'most intense' of US war on Iran

మిడిల్‌ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన అప్‌డేట్‌ వచ్చింది. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఆ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సె్త్ వెల్లడించారు. మంగళవారం పెంటగాన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన దాడుల కన్నా ఇప్పుడు తీవ్రంగా ఉంటాయన్నారు. శత్రువును ఓడించేదాకా వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు.  గత 24 గంటల్లో ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అయినా కూడా అమెరికా తన చర్యలను ఆపదని.. శత్రువు ఓడేదాక తమ దాడులు ఇలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. 

మరోవైపు అమెరికా సంయుక్త సైన్యాధిపతుల కమిటీ ఛైర్మన్ జనరల్ డాన్‌కేన్ మాట్లాడారు. ఈ సైనిక ఆపరేషన్‌లో అమెరికా మరింత బలంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఇరాన్ బలాన్ని ఛిద్రం చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇరాన్‌ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే గద్దె దించే పరిస్థితిని తీసుకురావడం తమ టార్గెట్ అని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు డిక్టేటర్‌షిప్ పాలన నుంచి బయట పడటమే తమ ఆశయమని వెల్లడించారు. 

Also Read: హ్యాట్సాఫ్.. తండ్రిగా తోటి సైనికులు .. అరచేతులపై నడిపించి.. కన్యాదానం చేసి!

గల్ఫ్‌ దేశాల్లోని పలు ప్రాంతాలపై ఇరాన్ ఇంకా దాడులు చేస్తోంది. ఖతార్‌ వైపు ఓ మిస్సైల్ దూసుకురావడంతో ఆ దేశం దాన్ని అడ్డుకుంది. అలాగే UAE కూడా ఇరాన్ నుంచి వచ్చిన మిస్సైల్స్‌ను అడ్డుకునేందుకు తమ గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్లు తెలిపింది. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ మార్గం ద్వారా చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్‌పై 20 రేట్లు దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ భద్రతా వ్యవహారాల అధికారి అలీ లారిజానీ స్పందించారు. త్యాగాలకు సిద్ధమైన ఇరాన్ మీ బెదిరింపులకు భయపడదని అన్నారు. మీకన్నా పెద్ద శక్తులు కూజా ఇరాన్‌ను కట్టడిచేయలేకపోయాయని.. మీరే ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ధ్వజమెత్తారు. 

Also Read: గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడే డేట్ వచ్చేసింది!

ఇదిలాఉండగా హర్ముజ్ జలసంధి మూసివేతతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. భారత్‌లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. LPG ఉత్పత్తిని 10 శాతం పెంచినట్లు వెల్లడించింది. గతంలో 27 దేశాల నుంచే చమురును దిగుమతి చేస్తుండగా.. ప్రస్తుతం 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు