/rtv/media/media_files/2026/05/28/fotojet-10-2026-05-28-07-26-35.jpg)
గాజాలో హమాస్ ఉగ్రవాద సంస్థకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ మిలిటరీ చీఫ్‌లలో ఒకరైన మహమ్మద్ ఒడెహ్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. గాజా సిటీలోని రద్దీగా ఉండే మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ భీకర దాడిలో మహమ్మద్ ఒడెహ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో కేవలం మహమ్మద్ ఒడెహ్ మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒడెహ్‌తో పాటు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, మరో మహిళ ఉన్నారు. మార్కెట్ ప్రాంతంలో జనం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ దాడి జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు.
ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్
Breaking 🚨 🚨 🇮🇱🇮🇷;
— Us_militryPower (@Trumpspoof__) May 28, 2026
Israeli airstrikes in Gaza City target Hamas's new military chief, Mohammed Odeh . pic.twitter.com/vsyBOEG4nH
ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?
హమాస్ నాయకులే టార్గెట్..
హమాస్ అగ్రనేతలను ఒక్కొక్కరిగా ఏరివేసే వ్యూహంలో భాగంగా ఇజ్రాయెల్ ఈ చర్య చేపట్టింది. ఈ నెల 16న హమాస్ మిలిటరీ చీఫ్‌గా ఉన్న ఇజ్ అల్ దిన్ అల్ హద్దద్‌ను కూడా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఇప్పుడు మహమ్మద్ ఒడెహ్‌ను కూడా అంతం చేయడంతో.. హమాస్ సైనిక నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడింది.
ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?
Update: Both the IDF and Qassam [Hamas] affiliated channels have confirmed the assasination of Mohammed Odeh.https://t.co/jEgaeZUy9ypic.twitter.com/bRuCMQ2jf7
— Stinky (@Stinky915846091) May 27, 2026
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడులను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరినీ వెతికి మరీ అంతం చేస్తామని.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ నాయకులపై చేస్తున్న ఈ వరుస దాడులు నెతన్యాహు ప్రకటించిన ఆ ప్రతిజ్ఞలో భాగమేనని తెలుస్తోంది.
Israeli strike a building in western Gaza City in an assassination targeting a Mohammed Odeh, described as Hamas’ new military wing leader. He also served as the fifth Hamas leader in the Gaza Strip. pic.twitter.com/qNyL8j0YJx
— Eretz Israel (@EretzIsrael) May 27, 2026
Follow Us