/rtv/media/media_files/2025/01/23/2Z3LqFLZvOB4J6qtV5El.jpg)
Greenpeace activists ‘confiscate’ private jets
స్విట్జర్లాండ్‌లోని దా వోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 20 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన బడా వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్‌పీస్ అనే అంతర్జాతీయ ప్రచార నెట్‌వర్క్ సంస్థకు చెందిన సభ్యులు చేసిన పని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ వాళ్లేం చేశారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: అలా చేస్తే మీ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలే ఉంటారు : ఏక్‌నాథ్ షిండే
ఇక వివరాల్లోకి వెళ్తే.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన బడా వ్యాపారులు తమ ప్రైవేటు జెట్‌లలో వచ్చారు. ఇందుకోసం వారు సమెదాన్‌లోని ఎండాగిన్ అనే ఎయిర్‌పోర్టులో తమ జెట్‌లను ల్యాండ్ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం గ్రీన్‌పీస్ సంస్థకు చెందిన యూరోపియన్ ప్రచారకర్తలు వారి ప్రైవేటు జెట్‌లను తమ ఆధినంలోకి తెచ్చుకున్నారు. వాటికి పలు పోస్టర్లు అతికించారు. గాలితో నింపిన పెద్ద బాల్, చైన్‌లను అటాచ్ చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.
Also Read: భారత్ సంచలనం.. 99.1 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య
వాళ్లు అతికించిన పోస్టర్లలో సంపన్నులకు ట్యాక్స్ వేసే సమయం వచ్చిందని రాసుకొచ్చారు. అలాగే వాతావరణ మార్పులు, పర్యావరణ సంక్షోభాన్ని పరిష్కరించేలా పోరాటం చేయాలని తమ గళాన్ని చాటిచెప్పారు. ఖరీదైన కర్బన ఉద్గారాలు భూగ్రహాన్ని నాశనం చేస్తున్నాయంటూ తమ పోస్టర్లతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దావోస్‌లోని గ్రీన్‌పీస్ ప్రతినిధి క్లారా థామ్సన్ మాట్లాడారు. '' ఈరోజు మేము ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వాలు అత్యంత ధనవంతులపై వారి కలుషితమైన ఆస్తులపై ట్యాక్స్ వేయాలి. ప్రపంచలోని కుభేరులే పరోక్షంగా వాతావరణ మార్పులను కారణమవుతున్నారు. వాళ్లకి ట్యాక్స్ వేయకపోతే మరింత ప్రమాదం జరుగుతుంది. ప్రజలను, భూమిని రక్షించాలంటే సంపన్నులపై సరైన ట్యాక్స్ వేయడం అనేది అనివార్యమని'' అన్నారు.
🚨BREAKING: Greenpeace activists “confiscate” private jets at #DAVOS airport! 🚨✈️ #TaxTheSuperRich
— Greenpeace Africa (@Greenpeaceafric) January 22, 2025
This is the third in a series of protests by Greenpeace International in connection to the World Economic Forum, calling on governments to tax the super-rich. pic.twitter.com/pCSiDof7Ve
We’re calling on governments to #TaxTheSuperRich and fund a just and green future! Help us reach 4,000 signatures today 👉 https://t.co/PqwBDcaDQ4 pic.twitter.com/EvYRgPUf5C
— Greenpeace Africa (@Greenpeaceafric) January 22, 2025