/rtv/media/media_files/2025/03/06/SebEgBJJ1uSjxWTYyrLi.jpg)
Pakistan In Second Place in Global Terrorism Index
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్...గ్లోబల్ టెర్రరిజంపై తాజాగా నివేదిక ప్రచురించింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా 163 దేశాలపై టెర్రరిజం ప్రభావాన్ని వివరించింది. ఉగ్రవాద ఘటనల సంఖ్య, ప్రాణనష్టం, గాయాలు, బందీలు, ఉగ్రవాదంపై ప్రభావం వంటి సూచికల ద్వారా ఈ సర్వేని చేసింది ఐఈపీ. ఈ సర్వే లో అన్నింటి కంటే ఆఫ్రికాలోని బుర్కినాఫాసోలో టెర్రరిజం అందరి కంటే ఎక్కువగా ఉందని చెప్పింది. దీని తరువాత స్థానంలో పాకిస్తాన్ ఉండగా..మూడవ ప్లేస్ లో సిరియా ఉంది.
ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి..
పాకిస్తాన్ లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు బాగా పెరిగాయి. దాంతో పాటూ అక్కడ చనిపోతున్నవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. 2024లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు 45 శాతం భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది. ఇక్కడ 52 శాతం మరణాలకు పాక్ తాలిబాన్లే కారణమని చెప్పింది. ముఖ్యంగా పాక్ లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే 96 శాతం ఉగ్రదాడులు, మరణాలు జరిగినట్లు సర్వే తేల్చింది.
ఇక గ్లోబల్ టెర్రరిజ ఇండెక్స్ లో భారత్ 14 వస్థానంలో ఉంది. ఉగ్రవాదం అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో డెన్మార్క్ దేశం ఉంది. ఇక ఇండియా పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 35వ స్థానంలో ఉండగా ...అగ్రరాజ్యం అమెరికా 34వ స్థానంలో ఉంది. మయన్మార్ 11వ స్థానంలో ఉంది. అనూహ్యంగా ఇరాక్, ఇరాన్, పాలస్తీనా వంటి దేశాలు టాప్-10 జాబితాలో లేవు. టెర్రరిజం ఇండెక్స్ లో టాప్ 10 దేశాలుగా బుర్కినాఫాసో, పాకిస్తాన్, సిరియా, మాలి, నైజర్, నైజీరియా, సోమాలియా, ఇజ్రాయిల్, ఆఫ్ఘనిస్తాన్, కామెరూన్ ఉన్నాయి.
Also Read: AP: ఆ షేర్ల బదిలీని రద్దు చేయండి..ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్