Firing: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి

అమెరికాలోని వాషింగ్టన్ ఏవ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు తల్లిదండ్రులు చైతన్యపురి పరిధిలోని ఆర్కేపుర గ్రీన్‌హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్నారు. తండ్రి పేరు చంద్రమౌళిగా గుర్తింపు.

New Update
ravijeta

ravijeta

Firing: అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ ఏవ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురకి చెందిన రవితేజ అనే యువకుడు మరణించినట్లు గుర్తించారు.. మృతుడు తల్లిదండ్రులు గ్రీన్‌హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్నారు. తండ్రి పేరు కొయ్యడ చంద్రమౌళిగా గుర్తింపు.

కాల్పుల్లో మృతి:

2022 మార్చిలో చదువుకునేందుకు రవితేజ అమెరికాకు వెళ్ళాడు. పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రవితేజ మృతి చెందిన విషయం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలవడంతో అతని నివాసం వద్ద విషాద ఛాయలు కలుముకున్నాయి. అయితే రవితేజ మృతి..? కాల్పులు ఎలా జరిగాయి..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఫుడ్ డెలివరీకి వాడే బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లతో క్యాన్సర్‌ ముప్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు