/rtv/media/media_files/2025/04/01/Xn6214b2FzX9qWenvOpG.jpg)
Fire At Tesla Dealership
Fire Accident: ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
ఇటలీలోని రోమ్ నగర శివార్లలోని టెస్లా షోరూంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.షార్ట్ సర్య్కూట్ లేదా ఇతర కారణాలతో షోరూం అంతా కాలిపోయింది. ఫలితంగా అందులో ఉన్న 17 కార్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే ఉదయం 4.30 గంటలకు మంటలు అంటుకున్నాయని.. అదృష్ట వశాత్తు షోరూంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
అయితే ఈ విషయం తెలుసుకున్న మస్క్ తాజాగా స్పందించారు. ఇది కావాలనే ఉగ్రవాదులు చేశారని ఆరోపించారు. తమ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తోందని.. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటలీ ఉప ప్రధాని మాటియో సాల్విని సైతం దీనిపై స్పందించి మస్క్‌కు మద్దతు తెలిపారు. టెస్లా కంపెనీపై కావాలని దాడులు చేయడం దారుణం అన్నారు. ఇకనైనా ఈ దాడులు ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను డోజ్ అధినేతగా నియమించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి.. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.. దీంతో వారికి అనేక మంది శత్రువులవుతున్నారు. ఈక్రమంలోనే స్థానిక ప్రజల నుంచి ఉగ్రవాదుల వరకు వీరిపై కోపంగా ఉన్నారు. అందుకే పగ తీర్చుకోవాలని ఎలాన్ మస్క్ కంపెనీపై దాడులు చేస్తున్నారు. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ దాడులు సాగుతున్నాయి. ఇటీవలే ట్రంప్ సైతం దీనిపై స్పందించి.. టెస్లా కార్లపై దాడికి పాల్పడితే 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్