ప్రపంచంలో హ్యాపీ దేశాల జాబితా విడుదల.. భారత్‌ ఏ స్థానమంటే ?

ఫిన్లాండ్‌ వరుసగా ఎనిమిదోసారి సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్‌లాండ్, నాలుగో స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. ఇక భారత్‌కు ఈసారి 118వ ర్యాంక్ వచ్చింది.

New Update
Finland is the happiest country in the world for the eighth year in a row

Finland is the happiest country in the world for the eighth year in a row

ఈమధ్యకాలంలో ప్రతీఒక్కరి జీవితాల్లో ఆందోళన, ఒత్తిడి అనేవి పెరిగిపోతున్నాయి. మనస్పూర్తిగా నవ్వుకునే పరిస్థితులు కూడా చాలామందిలో దూరమైపోయాయి. అయితే ఓ దేశం మాత్రం సంతోషకరమైన జీవితం గడపడంలో ఎప్పటికీ మందుంటోంది. వరుసగా ఎనిమిదోసారి కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటిస్థానంలో నిలిచింది. ఇంతకీ ఆ దేశం ఏంటి అని ఆలోచిస్తున్నారా ? అదే ఫిన్లాండ్. అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్సిటీలోని వెల్‌బీయింగ్‌ రీసర్చ్‌ సెంటర్‌ ఆనందకర దేశాల జాబితాను రిలీజ్ చేసింది. 

Also Read: అంతరిక్షంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు?

ఈ జాబితాలో మరోసారి ఫిన్లాండ్‌ సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్‌లాండ్, నాలుగో స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. ఇక భారత్‌కు ఈసారి 118వ ర్యాంక్ వచ్చింది. గతేడాది మనదేశం 126వ స్థానం దక్కించుగా.. ఈసారి కాస్త ముందుకెళ్లింది. ఇక చైనా 68వ స్థానంలో, పాకిస్థాన్‌ 109వ స్థానంలో చోటు సంపాదించి మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.  

Also Read: అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం

అమెరికాకు ఈ జాబితాలో 24వ స్థానం దక్కింది. పన్నెండేళ్ల క్రితం అగ్రరాజ్యం 11వ స్థానంలో ఉండేది. అప్పటినుంచి ప్రతీఏడాది దీని ర్యాంక్ పడిపోతూ వస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. సంపద, వృద్ధితో పాటు ఆత్మ సంతృప్తి, సంబంధాలు, మనుషుల మధ్య విశ్వాసం, స్వేచ్ఛ, జీవనకాలం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను తయారుచేశారు. 

Also Read: ప్రజల్లోకి వెళ్లాలంటే....గన్‌ లెసెన్స్‌ ఇవ్వండి...పోలీసులకు ఆ ఎమ్మెల్యే లేటర్‌..

Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మరికాసేపట్లో ట్రంప్ ప్రతీకార సుంకాల దండయాత్ర

అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

Trump Tariffs

భారత్ సహా చాలా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో..వాషింగ్టన్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ట్రంప్ వీటిని అనౌన్స్ చేయనున్నారు. వీటి వల్ల అమెరికా ఆదాయం భారీగా పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు. వైట్‌హౌస్‌ వర్గాల ప్రకారం ఏటా 600 బిలియన్‌ల నుంచి 700 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు. 

భారత్, చైనాలతో పాటూ ప్రపంచంలో అన్ని దేశాల మీద ప్రతీకార సుంకాల విధింపు ప్రారంభం అవుతుంది. రేపటి రోజును అమెరికా లిబరేషన్ డే అని ట్రంప్ ఒక పేరు కూడా పెట్టారు. ఇప్పటి వరకు వరల్డ్ లో అన్ని దేశాలకు తాము తక్కువ సుంకాలు విధిస్తున్నా...అవి మాత్రం అమెరికా దగ్గర నుంచి రెట్టింపు వసూలు చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని..ఏ దేశం ఎంత టారీఫ్ విధిస్తే తామూ అంతే విధిస్తామని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి వీటిని స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. మిత్ర దేశాలైన భారత్ లాంటి వాటికి కూడా ఈ సుంకాల మోత తప్పదని ట్రంప్ కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాపై సుంకాలను ఎత్తివేసే దేశాల పట్ల సానుకూలంగా, మంచి వాడిగా ఉంటానని తెలిపారు. ఇన్నాళ్ళు తాము చాలా ఏళ్లుగా మేం ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం..కానీ ఇక మీదట అమెరికాను దోచుకోనివ్వమని మరోసారి చెప్పారు ట్రంప్. 

అమెరికాకు శత్రుదేశాల కంటే మిత్రదేశాలే ఎక్కువ ద్రోహం చేశాయని ట్రంప్ అంటున్నారు. దశాబ్దాలుగా అవి మిమ్మల్ని దోచుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని దేశాలు అమెరికాను దోచుకున్న దానికంటే ఇప్పుడు తాము విధిస్తున్న సుంకాలు ఎంతో తక్కువని ట్రంప్ సమర్ధించుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నిటిపైనా మా వాణిజ్య సుంకాలు అమలవుతాయని చెప్పారు. 

సుంకాల కోత..

టారీఫ్ లవిషయంలో మిగతా దేశాల మాట ఎలా ఉన్నా...భారత్ మాత్రం అమెరికాకు ఎదురు తిరగదల్చుకోలేదని తెలుస్తోంది. సుంకాల విషయం అనౌన్స్ చేసిన దగ్గర నుంచే భారత్ వాటిని సమర్థిస్తూ వచ్చింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలన్న ఆలోచనతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. ఇండియా కూడా సరిగ్గా ఇలానే ఆలోచిస్తుందని అన్నారు. క్వాడ్‌లో ప్రతి దేశం తమవంతు పాత్ర పోషిస్తోంది. అందులో ఫ్రీ రైడర్లు ఎవరూ లేరు అంటూ జైశంకర్..ట్రంప్ ను వెనకేసుకుని వచ్చారు. దాని తరువాత భారత ప్రభుత్వం అమెరికాతో  ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చింది కూడా. దాని బట్టి అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించే దిశగా ఇండియా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. 

భారత్ పై ప్రభావం..

విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపు ప్రతి దేశమూ సుంకం  విధిస్తుంది. తమ దేశంలో తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం...దాని ద్వారా ఉద్యోగాలను సృష్టించడానికే ప్రభుత్వాలు ఈ పని చేస్తాయి. దీని వలన దేశ ఖజానా కూడా నిండుతుంది.  అయితే దీని వలన ఒక్కోసారి వినియోగదారులపై కూడా భారం పడే అవకాశం ఉంది. అధిక సుంకాల వలన ముడిసరుకు, కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహార వస్తువులు, కూరగాయలు, బట్టలు, ఎలక్ట్రిక్ మెషినరీ, జెమ్స్, జ్యూయలరీ, ఫార్మా, ఐరన్, స్టీల్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు పడే అవకాశం ఉంది. దాన్ని బట్టి వాటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా జరగకుండా ఉండడానికే భారత ప్రభుత్వం ఇప్పుడు యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై టారిఫ్‌‌‌‌‌‌‌‌లు తగ్గించాలని చూస్తోంది. మనం తగ్గితే ఆటోమేటిక్ గా అమెరికా కూడా సుంకాలను తగ్గిస్తుంది.

today-latest-news-in-telugu | usa | trump tariffs | india | china

Also Read: NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా..

Advertisment
Advertisment
Advertisment