/rtv/media/media_files/2025/03/16/aT1VH7W3VQMWP4yLtxbj.jpg)
Fridman Poscost With PM Modi
భారత ప్రధాని మోదీతో మూడు గంటల పాటు అద్బుతమైన ఇంటర్వ్యూ చేశాను. ఇది నా జీవితంలో అత్యంత పవర్ ఫుల్ ఇంటర్వ్యూ ఇది అంటూ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మన్ చెబుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టారు. మార్చి 16 సాయంత్రం అంటే ఈరోజే ఇది విడుదల అవనుంది.
అందరూ వినండి..
ఫ్రిడ్ మన్ సోషల్ మీడియా పోస్ట్ పై ప్రధాని మోదీ కూడా స్పందించారు. తన చిన్నతనం, హిమాలయాల్లో గడిపి సమయం లాంటి వాటి గురించి ఈ పాడ్ కాస్ట్ లో మాట్లాడాను అని మోదీ చెప్పారు. ఈ పాడ్ కాస్ట్ ను అందరూ వినాలని ఆయన కోరారు. ఇందులో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాల గురించి...ఏఐపై భారత్ పురోగతి గురించి కూడా మాట్లాడానని ప్రధాని తెలిపారు. ప్రధాని మోదీకి ఇది రెండో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ. అంతకు ముందు జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ తో కూడా ఒక పాడ్ కాస్ట్ ను నిర్వహించారు.
లెక్స్ ఫ్రిడ్ మన్...
ఫ్రిడ్ మన్ అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్, పాడ్ కాస్టర్. ఈయన ది లెక్స్ పఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్ కో ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్,ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వంటి ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూను చేశారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీతో చేసిన గురించి మాత్రం ఫ్రిడ్ మన్ చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను ఇప్పటివరకు అధ్యయనం చేసిన అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి ప్రధాని అని ఆయన చెప్పాడు.
It was indeed a fascinating conversation with @lexfridman, covering diverse topics including reminiscing about my childhood, the years in the Himalayas and the journey in public life.
— Narendra Modi (@narendramodi) March 15, 2025
Do tune in and be a part of this dialogue! https://t.co/QaJ04qi1TD