/rtv/media/media_files/2026/02/12/minister-2026-02-12-19-02-00.jpg)
అమెరికా(america) లో పోలీస్ వాహనం ఢీకొని మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు ఒక కీలక ముగింపు లభించింది. జాహ్నవి మరణానికి గానూ ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల (సుమారు ₹262 కోట్లు) భారీ పరిహారం చెల్లించేందుకు సీటెల్ నగరం అంగీకరించింది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఎవాన్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల జాహ్నవి కందుల, ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీలో ఆమె మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. అయితే, జనవరి 2023లో రోడ్డు దాటుతుండగా, కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది.
ఆ ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే. కానీ, సదరు అధికారి వాహనాన్ని ఏకంగా 119 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు విచారణలో తేలింది. ప్రమాదం(accident) జరిగిన సమయంలో ఆయన ఒక డ్రగ్ ఓవర్ డోస్ కాల్‌పై స్పందిస్తూ వెళ్తున్నారు.
Also Read : మోడీ ఫ్రెండ్స్ కోసమే ఒప్పందం.. ఇండియాకు నష్టాలేనన్న రాహుల్ గాంధీ
Seattle City Administration agrees to pay $29 million (~₹241 crore) to the family of Indian student Jaahnavi Kandula, who lost her life after being hit by a speeding Seattle police vehicle.
— RB. (@rahul4bisht) February 12, 2026
Justice may be late, but her life mattered. 🇮🇳🇺🇸 pic.twitter.com/YWrWXF6kLv
Also Read : స్కూల్లో 9 మందిని కాల్చి చంపిన ట్రాన్స్‌జెండర్ యువతి.. ఎందుకో తెలుసా?
కెమెరా రికార్డింగ్‌లో ఆయన నవ్వుతూ
జాహ్నవి మరణం ఒక ఎత్తైతే, ఆ తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీశాయి. బాడీ కెమెరా రికార్డింగ్‌లో ఆయన నవ్వుతూ, "ఆమె ప్రాణానికి విలువ తక్కువ" అని, "సిటీ ఒక చెక్కు రాసి ఇచ్చేస్తే సరిపోతుంది" అని ఎగతాళిగా మాట్లాడటం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై భారత దౌత్యవేత్తలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డేనియల్ ఆడరర్‌ను సర్వీస్ నుండి తొలగించారు. కారు నడిపిన కెవిన్ డేవ్‌ను కూడా డిస్మిస్ చేసి, 5,000 డాలర్ల జరిమానా విధించారు. మొత్తం $29 మిలియన్లలో, సుమారు $20 మిలియన్లు సిటీ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించనున్నారు.
Follow Us