/rtv/media/media_files/2026/03/06/epstein-files-2026-03-06-20-19-31.jpg)
Epstein files with claims against Trump released by US Justice Department
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా మరిన్ని ఫైళ్లను రిలీజ్ చేసింది. ఇందులో అధ్యక్షుడు ట్రంప్ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాలు బయటపడ్డాయి. తాను మైనర్‌గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించారని ఓ మహిళ 2019లో FBIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. జెఫ్రీ ఎప్స్టీన్.. తనకు 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నప్పుడు ట్రంప్‌ను పరిచయం చేసినట్లు చెప్పింది.
Also Read: ఖమేనీని చంపాలని నవంబర్లోనే ప్లాన్ చేసిన ఇజ్రాయెల్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఆ తర్వాత వాళ్లిద్దరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొంది. ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం వెలుగులోకి వచ్చినప్పుడు దీనికి సంబంధించిన విషయాలు బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని చెప్పింది. తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు వాపోయింది. మరోవైపు న్యాయశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. గతంలో తాము రిలీజ్ చేసిన కొన్ని ఫైళ్లలో ఆ మహిళ ట్రంప్‌పై అబద్ధాలు చెప్పినట్లు పలువురు చెప్పారని తెలిపారు. వాళ్లు చెప్పిన విషయాలను పరిశీలనకు పంపించామన్నారు.
Also Read: యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఖతార్ సంచలన ప్రకటన
పరిశీలనలు ముగిసిన తర్వాత గురువారం 47 వేల డాక్యుమెంట్స్ రిలీజ్ చేశామన్నారు. మరోవైపు ఎప్స్టీన్ ఫైళ్లపై ట్రంప్ యంత్రాంగం నిర్వహిస్తున్న తీరుపై డెమోక్రాట్లు కూడా విచారణ చేపట్టారు. ఇదిలాఉండగా ఎప్స్టీన్ ఫైళ్లతో తనకు సంబంధం లేదని ట్రంప్ చాలాసార్లు చెప్పారు. కానీ ట్రంప్‌పై ఆరోపణలు ఉన్న పత్రాలను న్యాయశాఖ అధికారులు మళ్లీ రిలీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us