/rtv/media/media_files/2026/02/11/epstein-bought-330-gallons-of-sulphuric-acid-the-day-fbi-launched-probe-2026-02-11-13-43-25.jpg)
Epstein Bought 330 Gallons Of Sulphuric Acid The Day FBI Launched Probe
ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని దర్యాప్తుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా మరిన్ని పత్రాలను రిలీజ్ చేసింది. 2018లో ఈ కేసుపై ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించింది. అది మొదలైన రోజునే ఎప్‌స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫైళ్లలో దీనికి సంబంధించిన ఆధారాలు దొరికాయి.
Also Read: అమెరికా వైఖరిలో మార్పు.. పప్పుధాన్యాల అంశంపై వెనక్కి!
55 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ డ్రమ్‌ను 2018, జూన్ 12న ఎప్‌స్టీన్ లిటిల్‌సెయింట్ జేమ్స్ ఐలాండ్‌లో డెలివరీ చేసినట్లు అతడి మెయిల్స్‌లో దీని రసీదు లభించింది. అయితే దర్యాప్తు అధికారులకు ఈ ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఎప్‌స్టీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కొని ఉంటాడని తెలుస్తోంది. ఈ యాసిడ్‌తో సాక్ష్యాలు, మానవ అవశేషాలను నాశనం చేసి ఉండొచ్చని పలు రిపోర్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: అమెరికా వైఖరిలో మార్పు.. పప్పుధాన్యాల అంశంపై వెనక్కి!
మరోవైపు తన ద్వీపంలో ఆర్వో నీటి శుద్ధీకరణ సిస్టమ్ నిర్వహణ కోసం ఎప్‌స్టీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడేవాడని అతడి ఫైల్స్‌లో ఉన్న వివరాల ద్వారా బయటపడింది. అయితే కేవలం ఆర్వో ప్లాంట్‌ను నిర్వహించేందుకు ఇంత పెద్ద మొత్తంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనాల్సిన అవసరం లేదని పలువురున నిపుణులు చెబుతున్నారు. సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకే ఎప్‌స్టీన్ ఈ యాసిడ్‌ను కొనుగోలు చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలాఉండగా ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఇటీవల విడుదలైన కొత్త ఫైల్స్ కూడా చర్చకు దారి తీశాయి. ఈ డాక్యుమెంట్స్‌లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. ఎప్‌స్టీన్‌తో కలిసి డిన్నర్ పార్టీలో పాల్గొన్న ఫొటో బయటపడింది. ఈ పార్టీని ఎప్‌స్టీన్ “వైల్డ్” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow Us