/rtv/media/media_files/2025/03/09/k037CI55SvHCUzVgk12Q.jpg)
Elon Musk and Zelensky
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధం కొనసాగేలా చేస్తున్నారని జెలెన్‌స్కీ తీవ్రంగా ఆరోపణలు చేశారు. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ స్టార్‌లింక్ సేవలను నిలివేస్తే.. ఉక్రెయిన్ సేనలు కుప్పకూలిపోతాయంటూ హెచ్చరించారు. యుద్ధం విషయంలో పుతిన్‌ను పక్కనపెట్టి ఉక్రెయిన్‌ను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారనే ట్వీట్‌పై ఎలాన్ మస్క్ ఇలా స్పందించాడు.
Also Read: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు
'' ఉక్రెయిన్ అంశంలో చర్చలకు రావాలని గతంలో పుతిన్‌కు సవాలు చేశాను. కీవ్ సైన్యానికి కూడా మా స్టార్‌లింక్ వ్యవస్థ సపోర్ట్ చేస్తోంది. ఒకవేళ ఈ సేవలు నిలిపివేస్తే.. యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్ సైన్యం కుప్పకూలుతుంది. ఉక్రెయిన్ ఓటమి అనివార్యం. అయినాకూడా ఏళ్లుగా సాగుతున్న ఊచకోత విసుగు పుట్టిస్తోంది. వాస్తవికతో ఆలోచించేవారు, అర్థం చేసుకునేవారు ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారని'' ఎలాన్ మస్క్ అన్నారు.
I literally challenged Putin to one on one physical combat over Ukraine and my Starlink system is the backbone of the Ukrainian army. Their entire front line would collapse if I turned it off.
— Elon Musk (@elonmusk) March 9, 2025
What I am sickened by is years of slaughter in a stalemate that Ukraine will…
‘‘ఉక్రెయిన్ విషయంలో ముఖాముఖికి రావాలంటూ గతంలో పుతిన్‌కు సవాలు విసిరాను. మరోవైపు.. కీవ్ సైన్యానికి మా స్టార్‌లింక్ వ్యవస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఒకవేళ ఈ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే.. రణరంగంలో కీవ్ సేనలు కుప్పకూలుతాయి. ఏదేమైనా ఉక్రెయిన్‌కు ఓటమి అనివార్యం. అయినప్పటికీ.. ఏళ్ల తరబడి సాగుతున్న ఊచకోత విసుగు పుట్టిస్తోంది. వాస్తవికతతో ఆలోచించేవారు, అర్థం చేసుకునేవారు ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారు’’ అని మస్క్ పేర్కొన్నారు.
Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్
ఇదిలాఉండగా.. వైట్‌హౌస్ దగ్గర్లో భారీ ఉక్రెయిన్ జెండా ఆవిష్కరణకు నిధులు ఎవరు ఇచ్చారని ఓ నెటిజెన్ ఎక్స్ వేదికగా అడిగిన ప్రశ్నకు మస్క్ ఇలా స్పందించారు. '' ఉక్రెయిన్‌కు చెందిన ఉన్న టాప్ 10 సంపన్నులపై, ముఖ్యంగా మొనాకోలోని విలాస భవనాలు ఉన్నావారిపై ఆంక్షలు విధించాలి. ఆ తర్వాత ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని'' మస్క్ అన్నారు.
Place sanctions on the top 10 Ukrainian oligarchs, especially the ones with mansions in Monaco, and this will stop immediately.
— Elon Musk (@elonmusk) March 9, 2025
That is the key to the puzzle. https://t.co/hgw8tQsEs6