మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది. ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.
చైనాకు మాత్రం లేదు..
అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
today-latest-news-in-telugu | usa | donald trump tariffs
Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం