Earthquake: భారీ భూకంపం.. 6 తీవ్రత నమోదు

ఇండోనేషియాలోని మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 5.32 UTC వద్ద 132 కి.మీ దూరంలో భూమి కంపించింది. భూమి ఉపరితలం క్రింద 32కి.మీ లోతులో ఇది సంభవించింది.

New Update
earthquake with sound

earthquake with sound

ఈ మధ్య భూకంపాలు విపరీతంగా సంభవిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ భూమి కంపించడంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మరోసారి భూమి షేక్ అయింది. ఇండోనేషియాలోని మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. మసోహికి ఉత్తర-వాయువ్య దిశలో 5.32 UTC వద్ద 132 కి.మీ దూరంలో భారీ భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 32 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ పేర్కొంది. భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు